TDP- Jana Sena : జనసేనకు ఇచ్చే టికెట్లు ఇవే.. చంద్రబాబు, పవన్ భేటీలో ఏం జరిగిందంటే..
ఇంచార్జిలను మారుస్తూ.. ఎన్నికల సమరశంఖం మోగించి ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ (CM Jagan) సవాల్ విసురుతున్న వేళ.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ(TDP), జనసేన (Janasena) ఫోకస్ పెట్టాయ్. చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి సమావేశం సాగింది. ఈ మీటింగ్‌లో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంచార్జిలను మారుస్తూ.. ఎన్నికల సమరశంఖం మోగించి ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ (CM Jagan) సవాల్ విసురుతున్న వేళ.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ(TDP), జనసేన (Janasena) ఫోకస్ పెట్టాయ్. చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి సమావేశం సాగింది. ఈ మీటింగ్‌లో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంతో పాటు.. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభపై ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీ(BJP) వైఖరి మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక అటు టికెట్ల పంపకాల విషయంలోనే ప్రధానంగా చర్చ జరిగింది.
జనసేనకు ఇచ్చే సీట్ల పైన చంద్రబాబు (Chandrababu) దాదాపు క్లారిటీ ఇచ్చారు. పవన్ మాత్రం తమకు మరిన్ని సీట్లతో పాటుగా స్థానాల పైన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సర్దుబాటులో భాగంగా జనసేనకు 22 నుంచి 25 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఐతే దీనికి పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కేటయించాలని కోరుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 45సీట్లకు తమ అభ్యర్దులతో సహా పవన్ జాబితా సిద్దం చేసినట్లు టాక్. గోదావరి జిల్లాల్లో 8, విశాఖలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 1, ప్రకాశంలో 2.. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో సీటు చొప్పున చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఐతే పవన్ లెక్కలు వేరుగా ఉన్నాయ్.
గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో సీట్లు పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు జాబితా తీసుకెళ్లి చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. మరి దీనిపై చంద్రబాబు రియాక్షన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్‌లోపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయాలని జనసేన, టీడీపీ ఫిక్స్ అయ్యాయ్. దీంతో ఇద్దరి భేటీ మీద రాజకీయంగా ఆసక్తి కనిపించింది. మరి పవన్ డిమాండ్లకు చంద్రబాబు అంగీకరిస్తారా.. చంద్రబాబు బుజ్జగింపులకు పవన్ కూల్ అయ్యారా అన్నది మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ తీరు మరో క్వశ్చన్ మార్క్‌గా మారింది. కలిసి వస్తుందా లేదంటే.. ఎవరి దారి వారు చూసుకోవాలా అన్న దానిపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.