సొంత కారు కూడా లేదు, విజయశాంతి ఆస్తులు ఇవే
కాంగ్రెస్ సీనియర్ నేత, యాక్టర్ విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. డాక్యుమెంటేషన్‌లో భాగంగా తనకున్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు విజయశాంతి.

కాంగ్రెస్ సీనియర్ నేత, యాక్టర్ విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. డాక్యుమెంటేషన్‌లో భాగంగా తనకున్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు విజయశాంతి. 115 కోట్ల విలువైన ఆస్తులున్న విజయశాంతికి కనీసం సొంత కారు కూడా లేకపోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. రాజకీయాల్లో ఏం సంపాదించారు ఎంత సంపాదించారు అనే విషయం పక్కన పెడితే.. విజయశాంతి చాలా సీనియర్ యాక్టర్.
సినిమా స్టార్స్ అనగానే వాళ్ల లగ్జరీ జీవితాలు కాస్లీ కార్లే చాలా మందికి గుర్తుకు వస్తాయి. అలాంటి ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్న సీనియర్ యాక్టర్ విజయశాంతికి కనీసం కారు కూడా లేకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర ఉన్న స్థిరాస్తుల విలువ 115 కోట్లు. ఇందులో చాలా వరకూ భూములే. హైదరాబాద్, చెన్నైలో విజయశాంతి దంపతులకు భూములున్నాయట. ఇందులో విజయశాంతి పేరు మీద 67.5 కోట్ల విలువ చేసే భూములున్నాయట. ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీద 45 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయట.
ఇక విజయశాంతి పేరు మీద బ్యాంక్‌లో కోటి రూపాయలు డిపాజిట్ కూడా ఉందట. అలాగే కోటీ 98 లక్షలు విలువ చేసే 2 కిలోల బంగారం కూడా ఉన్నట్టు చెప్పారు విజయశాంతి. ఇక ప్రస్తుతం తన దగ్గర 5 లక్షల 92 వేల నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివరించారు. తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర 30 వేల నగదు ఉన్నట్టు చెప్పారు. ఇక తన పేరున ఉన్న క్రిమినల్ రికార్డ్‌ను సైతం వివరించారు. తనపై హనుమకొండ, సంగారెడ్డిలో రెండు కేసులు ఉన్నట్టు చెప్పారు. అయితే ఇన్ని ఆస్తులు ఉన్నా.. విజయశాంతికి కనీసం కారు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.