వాళ్లు మోసం చేశారు రేవంత్ మాట నిలబెట్టుకున్నాడు
తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్లు. దాదాపు దశాబ్ధం కాలం నుంచి పేపర్లకు మాత్రమే పరిమితమైన విషయం ఇది. ప్రభుత్వాలు మారిపోయాయి.. ఏళ్లకు ఏళ్లు గడిచి పోయాయి.. కానీ ప్రభుత్వం నుంచి రియాక్షన్ మాత్రం లేదు.
తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్లు. దాదాపు దశాబ్ధం కాలం నుంచి పేపర్లకు మాత్రమే పరిమితమైన విషయం ఇది. ప్రభుత్వాలు మారిపోయాయి.. ఏళ్లకు ఏళ్లు గడిచి పోయాయి.. కానీ ప్రభుత్వం నుంచి రియాక్షన్ మాత్రం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ఎట్టకేలకు ఓ ఎండ్‌కార్డ్ వేసింది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు చోట్ల కలిపి 70 ఎకరాల స్థలం కేటాయించారు.
అయితే తర్వాత అది కోర్ట్ కేసుల్లో చిక్కుకుంది. సుప్రీం కోర్ట్ లో కేస్ పరిష్కారం అయితే చాలు. వెంటనే జర్నలిస్ట్ లకు స్థలాలు ఇస్తామని. హైదరాబాద్ లో అసలు భూమికి కొదవలేదు అంటూ కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. గతంలో భూమి కేటాయించిన వాళ్ళకే కాకుండా. గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు కూడా కొత్త గా కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్ట్ లో కేసు క్లియర్ అయింది. కేసు క్లియర్ అవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారం అందించింది.
కానీ అసలు కీలకం అయిన భూమి అప్పగింత విషయంలో చాలా లేట్ జరిగింది. ఇదే విషంలో చాలా మంది జర్నలిస్ట్‌లకు బీఆర్ఎస్‌కు మధ్య గ్యాప్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారిన తరువాత రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టకున్నారు. తాము అధికారంలోకి వస్తే జర్నిలిస్ట్‌లకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఆ పని చేయబోతున్నారు. జరలిస్ట్ హౌసింగ్ సొసైటీ కి ఇవ్వాల్సిన పేట్ బషీరాబాద్ భూమికి సంబందించిన ఫైల్ పై సంతకం చేశారు. దీనికి సంబదించిన మెమోను సొసైటీ కి అందించారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న 1100 మంది జర్నలిస్ట్ ల కల నెరవేరరింది.