వాళ్ళు బాగు పడరు, కేటిఆర్ పై చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కాం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన స్కాం తో పోలిస్తే నథింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కాం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన స్కాం తో పోలిస్తే నథింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ లో అవినీతి కి పాల్పడ్డ కుటుంబాలు బాగుపడ్డ చరిత్ర లేదని రుషికొండ ప్యాలెస్ లాగా ఢిల్లీ లో కూడా లెక్క లేకుండా విలాస వంతమైన భవనాలు నిర్మించారన్నారు. బటన్ నొక్కే మోడల్ ఢిల్లీ లో కూడా విఫలమైందన్నారు.
ఢిల్లీ లో ప్రధాన వీధుల్లో గార్బేజ్ ఉండే దుస్థితి నెలకొందని మోస్ట్ పొల్యూటెడ్ సిటి గా ఢిల్లీ నీ మార్చేసారని ఆరోపించారు. పంజాబ్ నుంచి రోజూ కేన్సర్ రోగులతో ఒక ట్రైన్ ఢిల్లీ కు వస్తోందన్నారు. అలాంటి పాలన చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ లో కూడా డ్రగ్స్ పెరిగిపోయాయని ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో నిరసనలు చేస్తే అణిచివేయాలి అని చూసిన వారు ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.