ప్రాణం పెట్టి భర్తను గెలిపించుకుంది, హేమంత్ సోరెన్ భార్య కల్పనా బ్యాగ్రౌండ్ ఇదే
ప్రతీ మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అర్థం చేసుకుని అండగా ఉండే భార్య దొరకాలే గానీ ఆ మగాడు జీవితంలో సాధించలేని విజయాలు ఉండవు. ఈ విషయంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే హేమంత్ విజయంలో బ్యాక్‌బోన్‌గా నిలిచింది,
ప్రతీ మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అర్థం చేసుకుని అండగా ఉండే భార్య దొరకాలే గానీ ఆ మగాడు జీవితంలో సాధించలేని విజయాలు ఉండవు. ఈ విషయంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే హేమంత్ విజయంలో బ్యాక్‌బోన్‌గా నిలిచింది, ఆయనను గెలిపించింది ఆయన భార్య కల్పనా సోరెన్. హేమంత్ జైలులో ఉన్నప్పుడు ఆమె పార్టీని హ్యాండిల్ చేసిన తీరుకు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఒకపక్క కుటుంబంలో ఉన్న సమస్యలను హ్యాండిల్ చేస్తూనే మరో పక్క పార్టీని కంట్రోల్ చేస్తూ వన్ ఉమెన్ షో నడిపించింది. ఇక హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో ఏకంగా 2 వందల పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేసింది. భర్త హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను తీసుకుంది. 39 ఏళ్లకే ఎంతో రాజకీయ పరిణతితో వ్యవహరించింది. ఇదంతా చేసిన ఆమెకు చాలా రాజకీయ అనుభవం ఉందా అంటే లేదు.
పరిస్థితి బాగున్నన్ని రోజులు కల్పనా రాజకీయలకు దూరంగానే ఉంది. ఒక సాదారణ మహిళ తన ఇంటిని ఎలా చూసుకుంటుందో అలానే చూసుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో తన అవసరం తన భర్తకు ఉందని గ్రహించిందో అప్పుడు వెంటనే సింగంలా ఎంట్రీ ఇచ్చింది. గాండేయ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి శాసన సభల్లోకి అడుగుపెట్టింది. కొత్తగా వచ్చింది కదా ఏం చేస్తుందిలే అనుకున్నారంతా. కానీ ప్రతీ విషయాన్ని చాలా వేగంగా నేర్చుకుంటూ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంది. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో పార్టీ ఇక విచ్చుకుపోయినట్టే అనుకున్నారు అంతా. కానీ ఆ శాయశక్తులూ ఒడ్డి పార్టీని నిలబెట్టింది. సీఎం కుర్చులో కూర్చుపే అవకాశం ఉన్నా.. కల్పనా మాత్రం ఆ పని చేయలేదు. ఎంతో చతురతతో సీఎం స్థానంలో వేరకరిని కూర్చో బెట్టి తాను మాత్రం పార్టీని నిలబెట్టి పని మీదేసుకుంది. అనుకున్నట్టుగానే భర్త బయటికి వచ్చే వరకూ పార్టీని కాపాడుతూ వచ్చింది. సోరెన్ బయటికి వచ్చాక కూడా దాదాపు 200 ప్రాంతాల్లో భర్తతో కలిసి పబ్లిక్ మీటింగ్‌లు అటెండ్ చేసింది. వెళ్లిన ప్రతీ చోటా కల్పనాకు నీరజనం పట్టారు ప్రజలు. ఎంత ధైర్యంతో పార్టీ బాధ్యత మీద వేసుకుందో.. అంతే నేర్పుతో పార్టీని గెలిపించి మరోసారి తన భర్తను సీఎం కుర్చులో కూర్చోబెట్టింది.