ప్రియాంకా గాంధీతో సై… నవ్య హరిదాస్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
వాయనాడ్ ఉప ఎన్నికల యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా... నవంబర్ 13న ఓటింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వాయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బిజేపికి అత్యంత కీలకం.
వాయనాడ్ ఉప ఎన్నికల యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా… నవంబర్ 13న ఓటింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వాయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బిజేపికి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో గెలిస్తే బిజెపికి ఓ ఎంపీ పెరిగినట్టే. అందుకే ఇక్కడ బిజెపి అగ్ర నేతలు ఎన్నికల ప్రచారం చేసే ఛాన్స్ కనపడుతోంది. కాంగ్రెస్ కు కూడా ఓ రకంగా ఈ ఎలక్షన్ కీలకమే. రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు ఇక్కడ గ్రాండ్ విక్టరీ కొట్టారు.
2019 లో కంచుకోట లాంటి అమేథిలో ఓడిపోయినా రాహుల్ వాయనాడ్ లో మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా రాహుల్ ఇక్కడ తన దమ్ము ఏంటో చూపించారు. అయితే ఈ సారి రాహుల్… తన తల్లి ప్రాతినిధ్యం వహించే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసారు. ఇక్కడ బిజెపి గెలుస్తుందని అందరూ లెక్కలు వేసారు. కాని రాహుల్… తన తల్లి కంచుకోటలో రాహుల్ గ్రాండ్ విక్టరీతో పాగా వేసారు. అయితే వాయనాడ్ నుంచి రాజీనామా చేసి అక్కడి నుంచి తన సోదరి ప్రియాంకా గాంధీని రంగంలోకి దించాలని రాహుల్ డిసైడ్ అయ్యారు.
దీనికి ప్రియాంకా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్ గా ప్రియాంక పేరుని ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇక్కడ విజయం సాధించడం పెద్ద మేటర్ కాదు. కాని బిజేపి పట్టుదలగా ఉండటంతో కాంగ్రెస్ వార్ రూమ్ లో హార్ట్ బీట్ పెరుగుతోంది. ఈ తరుణంలో… భారతీయ జనతా పార్టీ… యువ నాయకురాలు నవ్య హరిదాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనితో నవ్య హరిదాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అసలు ఆమె ఎవరో ఒకసారి చూద్దాం.
39 ఏళ్ళ నవ్య హరిదాస్, కాలికట్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. 2007లో బీటెక్ చేసిన ఆమె… రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కోజికోడ్ కార్పొరేషన్ లో రెండుసార్లు కౌన్సిలర్ గా ఎన్నిక కావడమే కాకుండా… బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే తన ఫేస్బుక్ పేజ్ లో మాత్రం ఆమె… బీజేపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా, BJMM రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవులు ఇచ్చుకోవడం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం చూస్తే నవ్యపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
ఇక నవ్య హరిదాస్ ఆస్తుల విలువ… కోటీ, 29 లక్షల, 56 వేల 264 రూపాయలు. ఆమె 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కోజికోడ్ సౌత్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రియాంకా గాంధీ ఇమేజ్ ముందు ఆమె ఏ విధంగా కూడా మ్యాచ్ కాదని కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాహుల్ గాంధీ పని తీరుపై వాయనాడ్ ప్రజల్లో పాజిటివ్ ఒపినియన్ ఉండటం ప్రియాంకా గాంధీకి కలిసి వచ్చే అంశం.