టాటా ట్రస్ట్ కొత్త చైర్మన్ నోయెల్ టాటా బ్యాగ్రౌండ్ ఇదే
పద్మశ్రీ రతన్ టాటా మరణం.. యావత్ భారతదేశానికి తీరని లోటు. లక్షల కోట్లు దానం చేసి కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా ఇక లేరని తెలిసి ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టింది. ఇంతటి సేవామూర్తి తరువాత ఆ స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అనేది అందరిలో ఉన్న ప్రశ్న.
పద్మశ్రీ రతన్ టాటా మరణం.. యావత్ భారతదేశానికి తీరని లోటు. లక్షల కోట్లు దానం చేసి కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా ఇక లేరని తెలిసి ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టింది. ఇంతటి సేవామూర్తి తరువాత ఆ స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అనేది అందరిలో ఉన్న ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగే సత్తా ఉన్నా.. టాటా మాత్రం సంపద కంటే సేవ వైపే ఎక్కువ మొగ్గు చూపారు. అందుకే ప్రపంచ కుభేరులు కూడా ఆయనకు దాసోహం అయ్యారు. అలాంటి వ్యక్తి తరువాత ఆ స్థానంలో కూర్చోవాలి అది అధికారం కాదు బాధ్యత. అంత పెద్ద బాధ్యత ఎవరికి ఇస్తే బాగుంటుందని చర్చించిన టాటా ట్రస్ట్ బోర్డ్.. రతన్ టాటా తమ్ముడు నోయెల్ టాటా పేరును ఖరారు చేసింది. బోర్డ్ సభ్యులు మొత్తం నోయెల్ టాటా పేరును ట్రస్ట్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజానికి నోయెల్ టాటా రతన్ టాటాకు సొంత తమ్ముడు కాదు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. నావల్ టాటా రెండో భార్య సిమోన్ టాటా కొడుకే ఈ నోయెల్ టాటా.
నోయెల్‌కు టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 వరకూ సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 3 వేల బిలియన్లకు పెంచారు. ఇది మాత్రమే కాదు. రతన్ టాటా తరువాత మొత్తం ట్రస్ట్ మీద మంచి గ్రిప్, మంచి పేరు ఉన్న మొదటి వ్యక్తి నోయెల్ టాటా. సాయం చేయడంలో ఆ కుటుంబ వారసత్వాన్ని అణువనువునా పునిపుచ్చుకున్న వ్యక్తి. వ్యాపారంలో ఆయన చూపే చరుతర కంటే దానంలో ఆయన చూపే దక్షతే ఆయనను ఇవాళ ఈ స్థానంలో కూర్చోబెట్టింది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11 వ చైర్మన్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్‌గా చేసింది.