ఫార్ములా-ఈ రేసింగ్‌లో కేటీఆర్ చేసిన తప్పు ఇదే

ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేరుస్తూ IAS అరవింద్‌ కుమార్‌ను ఏ2గా, HMDA మాజీ ఇంజనీర్‌ BLN రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ కేసును విచారించేందుకు ఏసీబీ డీజీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 12:05 PMLast Updated on: Dec 20, 2024 | 12:05 PM

This Is The Mistake Ktr Made In Formula E Racing

ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేరుస్తూ IAS అరవింద్‌ కుమార్‌ను ఏ2గా, HMDA మాజీ ఇంజనీర్‌ BLN రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ కేసును విచారించేందుకు ఏసీబీ డీజీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకున్నారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహించేందుకు 2022లో FEO అనే కంపెనీతో పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ రేసింగ్‌కు ప్రమోటర్‌గా ఉండేందుకు నెక్స్ట్‌ జన్‌ అనే కంపెనీ ముందుకు వచ్చింది.

రేసు నిర్వహణకు మొత్తం 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ రోడ్‌లో ట్రాక్‌ ఏర్పాటు చేసి.. రేసింగ్‌ నిర్వహించారు. ఈ రేసింగ్‌కు సెలబ్రెటీలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా వచ్చారు. కానీ ప్రమోటర్‌గా ఉన్న కంపెనీ ఊహించిన లాభాలు ఈ రేసింగ్‌ ద్వారా రాలేదు. దీంతో ప్రమోటర్‌ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు నెక్స్స్‌ జెన్‌ కంపెనీ ప్రకటించింది. దీంతో రేసింగ్‌ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ కేటీఆర్‌ ప్రమోటర్‌ బాధ్యతలు జీహెచ్‌ఎంసీ చూసుకుంటుందని.. రేసింగ్‌ కంటిన్యూ చేయాలంటూ FEO కంపెనీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏ నుంచి 55 కోట్లు FEO కంపెనీకి ఫార్వర్డ్‌ చేశారు. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నుంచి ఈ ట్రాన్జాక్షన్‌ జరిగింది. నిజానికి ప్రభుత్వంలో ఎవరైనా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటూ ఆర్థిక శాఖ అనుమతి తప్పసరి. కేబినెట్‌ అనుమతి కూడా తప్పనిసరి. కానీ కేటీఆర్‌ మాత్రం ఆర్థిక శాఖను సంప్రదించకుండానే డబ్బు FEO కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు. మొత్తం రెండు దఫాలుగా డబ్బు పంపేందుకు ఒప్పందం చేసుకున్నారు.

2023 అక్టోబర్‌ 3న 22 కోట్లు, అక్టోబర్‌ 11న మరో 23 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. విదేశీ కంపెనీకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఆర్బీఐ నుంచి తీసుకోవాల్సిన అనుమతి లేకుండానే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్లు ఫైన్‌ వేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్బీఐ నుంచి గవర్నమెంట్‌కు నోటీసు వచ్చింది. ఈ ఫైన్‌ దేనికోసం వేశారని ఆరా తీస్తే ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్ములా-ఈ రేసింగ్‌ పేరుతో విదేశీ కంపెనీ డబ్బు పంపి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. కేటీఆర్ మాజీ మంత్రి కావడంతో ఆయనను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. దీంతో ముందుగానే గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకున్నారు. గవర్నర్‌ నుంచి అనుమతి రాగానే సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. డిసెంబర్‌ 18న ఏసీబీకి లేఖ అందగానే డిసెంబర్‌ 19న కేటీఆర్‌ మీద కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీం ఆధ్వర్యంలో ఫార్ములా-ఈ కేసు విచారణ జరుగుతోంది.