ఛీ” కల్తీ నెయ్యి తయారి ప్రాసెస్ ఇదే, వింటేనే వాంతులు
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడరనే వార్తలు వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. అసలు కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారు అంటూ జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కల్తీ నూనెలు, నెయ్యి వ్యవహారాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం.
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడరనే వార్తలు వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. అసలు కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారు అంటూ జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కల్తీ నూనెలు, నెయ్యి వ్యవహారాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట కల్తీ నెయ్యి తయారు చేసే సంస్థలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కల్తీ నెయ్యి దందా ఎక్కువగా సాగుతుంది. అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్తుంది.
ఇక జంతు బలి ఎక్కువగా జరిగే ప్రాంతాల నుంచి ఈ నెయ్యి ఎగుమతి అనేది భారీగా ఉందనే మాట వాస్తవం. హైదరాబాద్ లో బీఫ్ ను కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయిస్తారు. అక్కడే కల్తీ నూనెలు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు కొందరు. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జంతు వ్యర్దాల్లో ఎక్కువగా గొడ్డు మాంసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యర్ధాలను రెండు మూడు రోజుల పాటు కుళ్లిపోయే వరకు అలాగే వదిలేస్తారు. వాటిలో నుంచి పురుగులు బయటకు వచ్చే వరకు కుళ్ళబేడతారు.
ఆ తర్వాత 3 నుంచి 4 టన్నులు పట్టే బాండీల్లో వేసి వాటిని 2 నుంచి 3 రోజుల పాటు మరిగిస్తారు. దీనితో వ్యర్దాల్లో ఉన్న ఎముకలు, ఇతర వ్యర్ధాలు కరిగి పేస్టు మాదిరిగా తయారు అవుతుంది. దీన్ని చల్లార్చి 20 లీటర్లు, 40 లీటర్ల డబ్బాల్లో పోస్తారు. ఆ డబ్బాలపై ప్రముఖ బ్రాండ్ లకు సంబంధించిన స్టిక్కర్ లు అతికించి అమ్మకానికి పంపుతారు. హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది.