జగన్ సభకు రావాలంటే ట్రిక్ ఇదే: కోటంరెడ్డి
మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసన సభా సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల స్పందించిన ఆయన...

మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసన సభా సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల స్పందించిన ఆయన… జగన్ అసెంబ్లీ కు రావాలంటే ఒక చిట్కా ఉందని… రోజుకు ఒక గంట జగన్ కు మాట్లాడేందుకు సమయం ఇస్తే ఆయనే అసెంబ్లీకు వస్తాడన్నారు. లేని పక్షంలో అతను రారని వ్యాఖ్యానించారు. ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం అతనికి ఇష్టం ఉండదు అన్నారు.
అందుకనే అతను అసెంబ్లీ కు రావడంలేదు…ఎవరిని రానివ్వడం లేదని తెలిపారు. మైక్ నాకు ఒక్కడికే ఉండాలి… ఇంకెవరు మాట్లాడకూడదు అని జగన్ అనుకుంటారన్నారు. అందుకనే జగన్ కు స్పీకర్ గంట సమయం మాట్లాడటానికి ఇస్తానంటే రేపే అసెంబ్లీ కు వస్తారన్నారు. జగన్ ను చూసి చాలా రోజులు అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడు సమస్యలు కోసం పోరాడలేదని ఆరోపించారు.