ఇదేం ట్విస్ట్ మహిపాల్ అన్నా.. భయపడుతున్నవా ఏంది..
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్‌గా ఉంది.. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది వ్యవహారాన్ని ! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ అన్నారు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్‌గా ఉంది.. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది వ్యవహారాన్ని ! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ అన్నారు. కేసీఆర్ నమ్మినోళ్లు.. కారు పార్టీకి సన్నిహితులు అనుకున్న వాళ్లు కూడా.. హ్యాండ్ ఇచ్చారు. దీంతో గులాబీ అధినేత ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దేఖ్‌లేంగే అని.. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వెళ్లిన ప్రతీచోట కేసు గెలుస్తాం.. ఉప ఎన్నికలు ఖాయం అంటున్నారు కేసీఆర్. నిజానికి ఈ కేసులో రేపో మాపో తీర్పు కూడా రాబోతోంది. కట్ చేస్తే.. ఇక్కడే అరుదైన, అద్భుతమైన, అమాయకమైన సీన్ కనిపించింది ఒకటి. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
సీఎం రేవంత్‌ను కలిసిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరారనే అనుకున్నారు అంతా ! అనుకున్నారు అని ఎందుకు అంటున్నామంటే.. ఆయన ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది మరి. తాను పార్టీ మారలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. మైండ్‌బ్లాంక్ షాక్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు కీడా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈనెల 25న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. అందులో భాగంగా మహిపాల్‌రెడ్డి సుప్రీంకోర్టుకు ఇలాంటి వివరణ ఇచ్చారు. ఐతే మహిపాల్ ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇచ్చారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే… ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయ్. ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని చాలామందిలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే దాదాపు అందరు ఫిరాయింపుదారులు తాము పార్టీ మారలేదని చెప్తున్నారు. తాము ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నామంటున్నారు.
మహిపాల్ రెడ్డి ఆన్సర్ కూడా అలాంటిదే. ఏమైనా.. కేసీఆర్ చేసిన పని.. ఫిరాయింపు ఎమ్మెల్యేకు భయాన్ని పరిచయం చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఐతే ఇక్కడే అసలు ట్విస్ట్. అఫిడవిట్ అంటే ఒక రకంగా.. ప్రామిసరీ నోటులాంటిది. అందులో నిజమే చెప్పాలి.. అలాంటిది మరి ఎందుకు మహిపాల్ రెడ్డి అబద్దం చెప్పారు.. ఈ అబద్దాన్నే నిజం చేస్తారా.. నిజంగా నిజం ఇదేనా, అప్పుడు చెప్పిందే అబద్దమా.. ఏది నిజం.. ఏది అబద్దం అంటూ టంగ్ ట్విస్టర్లు రాసుకుంటున్నారు నెటిజన్లు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటో తీయను అని చెప్పడం.. అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్‌ను వెళ్లి కలవడం.. ఇవన్నీ గుర్తుచేసుకొని మరీ.. మహిపాల్ ఆన్సర్‌కు రీజన్ వెతికే పనిలో పడ్డారు మరికొందరు.