Times Now Survey: మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం.. టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర విషయాలు..
ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే.. గులాబీ పార్టీదే అధికారం అని చెప్తున్న సర్వే.. లోక్‌సభ స్థానాల విషయంలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఉన్న 17ఎంపీ సీట్లకు గానూ.. బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే చెప్తోంది.
Times Now Survey: సార్వత్రిక ఎన్నికలకు అటు ఇటుగా ఇంకా ఏడాది సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అటు జనాల్లోనూ మళ్లీ ఎవరిది అధికారం అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జనాలు ఎవరిని గెలిపిస్తారనే అంశంపై టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా.. కేంద్రంలో ఎన్డీయే కూటమే మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది.
బీజేపీ కూటమికి 296 నుంచి 326 వరకు సీట్లు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షాలు ఉన్న ఇండియా కూటమికి 160 నుంచి 190 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఆ సర్వేలో వెల్లడయింది. రాష్ట్ర రాజకీయల నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్.. సర్వేలో మరోసారి స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే.. గులాబీ పార్టీదే అధికారం అని చెప్తున్న సర్వే.. లోక్‌సభ స్థానాల విషయంలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఉన్న 17ఎంపీ సీట్లకు గానూ.. బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే చెప్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ 9ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఇప్పుడు కూడా సరాసరిగా అన్నే సీట్లు గెలుచుకోనున్నట్టు సర్వేలో తెలుస్తోంది.
బీజేపీ గత ఎన్నికల్లో 4స్థానాలు దక్కించుకోగా.. ఈసారి 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే చెప్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. ఈ సారి 3 నుంచి 4 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక అటు దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా ఏపీలోని వైసీపీ అవతరించే అవకాశమున్నట్లు టౌమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఏపీలో మెుత్తం ఎంపీ స్థానాలు 25 కాగా.. ఆ పార్టీకి 24 నుంచి 25 సీట్లువచ్చే అవకాశం ఉందని రిపోర్టులో తేలింది. ఇదే నిజం అయితే.. ఏపీలో లోక్‌సభ స్థానాలను వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినట్లే !