BJP campaign : నేడే చివరి తేదీ.. ప్రచారంలో జోర్ పెంచిన.. బీజేపీ
బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి తరపున ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. బాలానగర్ కూడలి నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది. కొత్త బోయినపల్లి క్రాస్ రోడ్డు, బోయినపల్లి పీఎస్, పాత బోయినపల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట్ బస్టాప్, అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. పవన్ రోడ్ షోకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Today is the last date.. BJP has stepped up its campaign
నేడు ఎన్నికల ప్రచారానికి చివ రోజు.. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగియనుంది. సాయంత్రం 4 గంటలకే వామపక్ష తీవ్రవాద, ఏజెన్సి, నక్సలేట్ ప్రాంతాల్లో ఉన్న 13 నియోజకవర్గాల్లో ముందుగానే ప్రచారం ముగియనుంది. నేటితో ప్రచారం ముగియడంతో.. ఈ సాయంత్రం నేతలు ఎవరు కూడా.. స్టార్ క్యాంపెయినర్లు మీడియాతో మాట్లాడవద్దని, మీడియా సమావేశాలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టి తెలంగాణపైనే ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 ఆదివారం వెలువడనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్లలో ఓటింగ్ ముగిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
Wines bandh : నేటి నుంచి మూడు రోజులు వైన్స్ బంద్.. పోలింగ్ నేపథ్యంలో ఆంక్షలు
నేడు తెలంగాణకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే .. బీజేపీ తరఫున ప్రచారం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియడంతో.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో ప్రచారం జోరు గా చేస్తున్నారు.
చివరి రోజు కావండో.. వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, బోథ్, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హన్మకొండలో ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్ అర్బన్లో ప్రచారం చేయనున్నారు. దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేయనున్నారు.
హైదరాబద్ లో పవన్ రోడ్ షో..
బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి తరపున ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
బాలానగర్ కూడలి నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది. కొత్త బోయినపల్లి క్రాస్ రోడ్డు, బోయినపల్లి పీఎస్, పాత బోయినపల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట్ బస్టాప్, అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. పవన్ రోడ్ షోకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ పొలింగ్ కు ఎన్నికల అధికారులు సర్వ సిద్ధం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. అవసరమైన దానికంటే 25 శాతం అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేసింది ఈసీ.