Top story ఒక మోటార్ మెకానిక్ ఆత్మ కథ.
నారా రామ్మూర్తి నాయుడు. ఏపీ ముఖ్యమంత్రి... రాజకీయ ఉద్దండడు చంద్రబాబు నాయుడు తమ్ముడు. చరిత్రకు అందని, ఈ తరానికి తెలియని ఒక గొప్ప తమ్ముడు రామ్మూర్తి నాయుడు. అన్నలు తమ్ములు కోసం త్యాగాలు చేయడం మనం వినుంటాం.
నారా రామ్మూర్తి నాయుడు. ఏపీ ముఖ్యమంత్రి… రాజకీయ ఉద్దండడు చంద్రబాబు నాయుడు తమ్ముడు. చరిత్రకు అందని, ఈ తరానికి తెలియని ఒక గొప్ప తమ్ముడు రామ్మూర్తి నాయుడు. అన్నలు తమ్ములు కోసం త్యాగాలు చేయడం మనం వినుంటాం. తమ్ముడు చదువు కోసం, తమ్ముడు ఉద్యోగం కోసం, తోడబుట్టిన వాడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నలు త్యాగాలు చేయడం, ఆదుకోవడం ఇవన్నీ చరిత్ర చూసినవే. అందరికీ తెలిసినవే. కానీ చరిత్ర చూడని ఒక తమ్ముడి కథ రామ్మూర్తి నాయుడు కథ.
నారావారిపల్లెలో ఖర్జూర నాయుడు అమ్మనమ్మలకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చంద్రబాబు నాయుడు మొదటినుంచి ప్రత్యేకం. అతని చదువు, అతను కాలేజీ గొడవలు, అతని యూనివర్సిటీ రాజకీయం …చంద్రబాబు పద్ధతి వేరు. కానీ రామ్మూర్తి నాయుడు చంద్రబాబు కంటే సుమారు మూడేళ్లు చిన్న. కుటుంబ భారాన్ని మోసింది మాత్రం రామమూర్తి నాయుడే. రెండు ఎకరాల ఆసామి అయిన ఖర్జూరపు నాయుడుకు ఇద్దరినీ చదివించడం కష్టం అయిపోయింది. పెద్దకొడుకు చదువుపై ఆసక్తి ఉండడంతో సహజంగానే దూసుకుపోగలిగాడు. కానీ చిన్న కొడుకు రామ్మూర్తి మాత్రం బోలా వ్యక్తిత్వం. దూకుడు తనం. ఊర్లో ఫ్రెండ్స్ అందర్నీ కలుపుకొని ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న వ్యక్తి. పేదరికం రామ్మూర్తి నాయుడిని వెనకడుగు వేసేలా చేసింది. అన్న చదువు కోసం రామ్మూర్తి నాయుడు త్యాగం చేశాడు. తాను మోటర్ మెకానిక్ గా మారాడు. పొలంలోని పంపు సెట్ లకు మోటర్లు బిగిస్తూ ఉండేవాడు. అలాగే మోటర్లకు రిపేర్లు కూడా చేసేవాడు. నారావారిపల్లె చుట్టుపక్కల పంపు మోటార్లకు రిపేర్ చేయాలంటే రామ్మూర్తికి కబురు వెళ్లాల్సిందే. రామ్మూర్తి నెల నెల పంపిన డబ్బులతోనే చంద్రబాబు పీజీ వరకు చదువుకున్నాడని, ఎం ఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత ఎన్జీరంగా ఎకనామిక్ పాలసీస్ పై పీహెచ్డీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాడని సన్నిహితులు చెప్తుంటారు. అన్నకు అవసరమైనప్పుడల్లా ముందు చూడకుండా రామ్మూర్తి నాయుడు అప్పులు చేసి డబ్బులు పంపిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది రామ్మూర్తి నాయుడు స్వయంగా చెప్పిన విషయం. రామ్మూర్తి డిగ్రీ వరకు చదువుకున్న…. ఆ చదువు అంతంత మాత్రమే. ఏది ఏమైనా చంద్రబాబు తొలినాళ్లలో సాధించిన విజయాల వెనుక రామ్మూర్తి నాయుడు కష్టం చాలా ఉంది. 1981 నాటి కె చంద్రబాబు నాయుడు చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రి అవడంతో కుటుంబం కష్టాలు తీరాయి.
కానీ అప్పటివరకు కుటుంబం మొత్తాన్ని భుజాలపై మోసింది రామ్మూర్తినాయు డే. సహజంగా బోలా మనిషి . పెద్ద వ్యూహకర్త కాకపోవడంతో రామ్మూర్తి చంద్రబాబునాయుడు కి రాజకీయాల్లో ఉపయోగపడలేదు. ఎత్తుకు పైఎత్తులు వేయడం…. తడిగుడ్డతో గొంతులు కోయడం, తెరవెనక రాజకీయాలు చేయడం ఇవేమీ తెలియని వ్యక్తి రామ్మూర్తి నాయుడు.1994 నుంచి 99 వరకు చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యేగా చేసినప్పటికీ రాజకీయాల్లో స్థిరమైన నాయకుడిగా మాత్రం ఉండలేకపోయాడు. అంతేకాదు ఆర్థికంగానూ ఎదగలేకపోయాడు. కన్స్ట్రక్షన్ తో పాటు చిన్నాచితక వ్యాపారాలు చేసిన కలిసి రాలేదు. రామ్మూర్తి నాయుడికి అత్యంత సన్నిహితుడు బాలయ్య బాబు. బాలయ్యను బాలకృష్ణ బావ అని చాలా చొరవగా చనువుగా పిలిచేవాడు రామ్మూర్తి నాయుడు. అంతేకాదు ఇద్దరు మెన్షన్ హౌస్ గ్లాస్ మేట్స్ కూడా. మోటర్ మెకానిక్ గా రూపాయి రూపాయి కూడబెట్టి అన్నగారిని అందులో ఎక్కించినప్పటికీ…. అన్నగారి అధికారాన్ని స్వ ప్రయోజనాలకి వాడుకోలేకపోయాడు రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు సంగతి తెలిసిందే కదా. యూస్ అండ్ త్రో పాలసీ. అది తమ్ముడి విషయంలో కూడా అమలైంది. అన్నగారి నిర్లక్ష్యాన్ని, తన ను ఆదుకోకపోవడాన్ని సహించలేకపోయాడు నారా రామ్మూర్తి నాయుడు. బాబు కుటుంబాల మధ్య కొంత దూరం కూడా పెరిగింది. చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన రామ్మూర్తి నాయుడు ఏకంగా సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరా డు. 2004లో తనకు చంద్రగిరి సీటు కావాల్సిందేనని పట్టుబడ్డాడు. కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో అక్కడ కూడా మోసపోయాడు రామ్మూర్తి. చివరికి రాజకీయాల్లో పూర్తిగా వెనుకబడి పోయాడు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పని చేసిన… అక్కడ రామ్మూర్తి హవా అంతంత మాత్రమే. ఆర్థికంగానూ పెద్దగా నిల్తుక్కోలేకపోయాడు. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు ఇతర వ్యాపారాలు చేసిన కలిసి రాలేదు.
తమ్ముని కొన్నాళ్లపాటు పూర్తిగా దూరంగా పెట్టాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ చంద్రబాబుని తిట్టడానికి రామ్మూర్తిని ఆయుధంగా వాడుకుంది. ఆ తర్వాత వదిలేసింది. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ హీరోగా నెల తొక్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎప్పటికీ నారా రోహిత్ కు ఒక బంపర్ సూపర్ హిట్ దొరకలేదు. చెత్త రాజకీయాలతో విసిగిపోయి పూర్తిగా సంతూర్ కి పరిమితం అయిపోయాడు రామ్మూర్తి. ఎక్కువగా చెన్నైకి వెళ్లడం, అక్కడ మిత్రులతో కాలక్షేపం చేయడం రామ్మూర్తి అలవాటు. క్రమంగా ఆలోచించింది. నరాల సంబంధించిన వ్యాధి వచ్చింది. అల్జీమర్స్ కూడా వచ్చింది. మానసిక స్థితి దెబ్బతింది. ఎవరిని గుర్తు పట్టలేని పరిస్థితి వచ్చేసింది. చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకున్నాడు. అయితే అప్పటికే రామ్మూర్తి పరిస్థితి చేజారిపోయింది.
గొప్ప రాజకీయ నాయకుడు కాదు, వ్యూహ కర్త కాదు. కానీ ఓ గొప్ప తమ్ముడు. ఏపీ రాజకీయ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు జీవితంలో రామ్మూర్తి నాయుడు చేసిన త్యాగం బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు, కనీసం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకున్న చాలు.