Top story బామ్మర్ది ఫామ్ హౌస్ లో ఆ రాత్రి ఏం జరిగింది ?
హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ బండారం బయటపడింది. ఈ పార్టీలో విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆధారాలు దొరికాయి.
హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ బండారం బయటపడింది. ఈ పార్టీలో విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆధారాలు దొరికాయి. అంతేకాదు ఏకంగా కేటీఆర్ భార్య ఈ పార్టీలో ఉన్నారు అనే వాదన ఈ వ్యవహారాన్ని మరింత సంచలనం చేసింది.
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని అక్కడ ప్రముఖులు చాలామంది ఉన్నారని … డయల్ 100 కి ఒక ఆగంతకుడు సమాచారం ఇచ్చాడు. వెంటనే నార్సింగి పోలీసులు, ఎస్ ఓ టి , ఎక్సైజ్ అధికారులు మోకిలాలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు. ఆ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. అక్కడ పదిన్నర లీటర్ల ఏడు విదేశీ లిక్కర్ బాటిల్స్ దొరికాయి. అలాగే మహారాష్ట్ర ఢిల్లీ నుంచి అనుమతి లేకుండా వచ్చిన లిక్కర్ బాటిల్స్ కూడా ఆ పార్టీలో పట్టుపడ్డాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎక్సైజ్ శాఖ పర్మిషన్ లేకుండా అక్కడ ఎంత పెద్ద మందు పార్టీ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా నాలుగు ఐదు బాక్సుల్లో క్యాసినో గేమ్స్ మెటీరియల్ కూడా అక్కడ పడి ఉంది. బహుశా క్యాసినో గేమ్స్ ఆడడానికి అన్ని సిద్ధం చేసుకుని ఉంటారు.35 మందికి పైగా ఉన్న లిక్కర్ పార్టీలో ఎక్సైజ్ లైసెన్స్ ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నకు ఎవర్నించి స్పష్టమైన సమాధానం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో చాలామంది ప్రతిఘటించారు. ముఖ్యంగా మహిళలు పోలీసులపై బూతులు తిడుతూ విరుచుకుపడ్డారని ఎఫ్ఆర్ లో వివరించారు.
మద్దూరి విజయ్ అన్న వ్యక్తి దగ్గర శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే అతను కొకైన్ తీసుకొని ఉన్నట్లు బయటపడింది. అంతకుముందు డ్రగ్ టెస్ట్ లో శాంపిల్ ఇవ్వడానికి మద్దూరి విజయ్ చాలాసేపు నిరాకరించారు. ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడంతో బ్లడ్ శాంపిల్స్ కోసం అతనిని హాస్పిటల్ కి తరలించారు. ఈ పార్టీ మొత్తం రాజ్ పాకాల నిర్వహించినట్లు స్పష్టంగా తేలింది. రాజ్ పాకాల్ పై ఎక్సయిజ్ పోలీసుల కేసు నమోదు చేశారు .ఫార్మ్ హౌస్ మేనేజర్ కార్తీక్, రాజేంద్ర ప్రసాద్ పై కూడా కేసు నమోదు నమోదయింది. పార్టీలో దొరికిన మహారాష్ట్ర ,ఢిల్లీ కి చెందిన అనుమతి లేని మద్యమని తెలిసింది.విదేశీ మద్యం సరఫరా చేసినందుకు కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మద్దూరి విజయ్ ని ప్రశ్నిస్తే చాలా ఆసక్తికరమైన , కీలకమైన విషయాలు బయట పెట్టాడు. రాజ్ పాకాల కున్న రెండు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కంపెనీకి విజయ్ సీఈవో. రాజ్ పాకలకు అత్యంత సన్నిహితుడు . రాజ్ పాకాల దివాలి పార్టీ అని తనను పిలిచాడని , అతనే తనకి కోకైన్ ఇచ్చాడని, డ్రగ్ తీసుకున్న మాట నిజమేనని విజయ్ మద్దూరి అంగీకరించాడు. విజయ్ వాంగోలం మోకిలా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో రికార్డ్ అయింది.
-కోకైన్ తీసుకోవాలని రాజ్ పాకాల బలవంతం చేశాడని పోలీసులకు విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో
-కేసులో ప్రధాన నిందితుడు గా రాజ్ పాకాల, A2 గా విజయ్ మద్దూరి ని మొకిలా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పెట్టారు. ఆ తర్వాత రాజ్ పాకాల, కేటీఆర్ నివాసం ఉండే ఓరియన్ విల్లాస్ కు వెళ్లారు పోలీసులు. అక్కడ రాజ్ పాకాల ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఏం దొరికాయ్ అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు చాలా విషయాలకు సమాధానం దొరకాలి. ఈ పార్టీకి మొత్తం ఎంతమంది వచ్చారు ? పోలీసులు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రముఖులు ఎవరు? లోకల్ లిక్కర్ మాత్రమే అనుమతించే పార్టీలోకి విదేశీ మద్యం, ఇతర రాష్ట్రాల లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చాయి ?ఎలా వచ్చాయి ?రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? ఎక్కడ కొకైన్ కొన్నారు? ఈ పార్టీలో ఎవరెవరున్నారు? విజయ్ కాకుండా ఇంకెవరు వీటిని తీసుకున్నారు,? శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏది? ఇవన్నీ తేలాల్సి ఉంది. అన్నిటికన్నా కీలకమైన విషయం ఈ కేసులో విజయ్ మద్దూరి బాధితుడుగాను, రాజ్ పాకాల పెడ్లర్ గా తేలితే తెలంగాణలోనే ఒక సంచలన కేసుగా మారవచ్చు.