Top story: తెలంగాణలో ఢిల్లీ స్ట్రాటజీ.. బీజేపీది మాములు ప్లాన్ కాదుగా!

హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 48 నియోజకవర్గాల్లో విజయం సాధించి.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టింది. ఆప్‌ను 22 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. గత రెండు ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్‌కు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2025 | 12:01 PMLast Updated on: Feb 10, 2025 | 12:04 PM

Top Story Delhis Strategy In Telangana Is Not Bjps Usual Plan

హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 48 నియోజకవర్గాల్లో విజయం సాధించి.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టింది. ఆప్‌ను 22 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. గత రెండు ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్‌కు.. కాంగ్రెస్‌ను జీరోకు పరిమితం చేసి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న కేజ్రీవాల్.. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పార్టీ గెలిపించకపోవడమే కాదు.. తాను కూడా ఎమ్మెల్యేలగా గెలవలేకపోయారు. ఢిల్లీ ఫలితం గురించి దేశమంతా మాట్లాడుతోంది. హస్తిన రిజల్ట్ ఎఫెక్ట్.. దేశంలో ప్రతీ రాష్ట్రం మీద పడే చాన్స్ ఉంటుంది. ఎక్కడో జరిగే ఓ పరిణామం.. మరెక్కడో జరిగే ఇంకో పని ప్రభావితం చేస్తుంది.. బటర్‌ఫ్లై థియరీ అంటారు దీన్నే ! పాలిటిక్స్‌లో పక్కాగా కనిపించే ఫార్ములా ఇది. ఢిల్లీ జోష్‌తో.. మిగతా రాష్ట్రాలపై బీజేపీ మరింత దూకుడు చూపించే చాన్స్ ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. నార్త్‌లో దాదాపు బీజేపీ క్లీన్‌స్వీప్. అన్ని రాష్ట్రాల్లోనూ కమలానిదే అధికారం.

ఐతే దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలు బీజేపీకి సవాల్‌గా మారుతున్నాయ్. ఐతే ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ హ్యాట్రిక్‌ విజయాలతో.. సౌత్‌ మీద బీజేపీ కన్నేసే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. అదే చేస్తే.. కమలం పార్టీ ఫస్ట్ టార్గెట్‌ తెలంగాణే కావడం ఖాయం. దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలతో కంపేర్‌ చేస్తే.. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ట్రయాంగిల్ ఫైట్ ఖాయం అనుకున్నారంతా ! కమలం పార్టీలో పరిణామాలు.. బీజేపీని 8 సీట్లకు పరిమితం చేశాయ్. ఢిల్లీ ఇచ్చిన జోష్‌తో.. తెలంగాణలో బీజేపీ చక్రం తిప్పడం ఖాయం. తెలంగాణలోనూ అధికారం తమదే అని ఇప్పటికే బండి సంజయ్‌లాంటి వాళ్లు ప్రకటనలు చేసేస్తున్నారు. అటు బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలతో యుద్ధ భేరీ మోగించేందుకు రెడీ అయింది. ఆ తర్వాత స్థానిక సంస్థల పోరు.. గ్రేటర్ ఎలక్షన్‌.. ప్రతీ ఎన్నికను అవకాశంగా మార్చుకొని గ్రౌండ్‌ లెవల్‌లో మరింత స్ట్రాంగ్‌ కావాలి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పావులు కదపాలని బీజేపీ ఫిక్స్ అయింది.

దీనికోసం ఢిల్లీ స్ట్రాటజీని అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బూత్ స్థాయి నుంచి టార్గెట్ చేసిన బీజేపీ.. ఢిల్లీలో అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటన్నింటికి తోడు.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు.. బీజేపీ దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు ఉన్నాయ్. ఢిల్లీలో ఆప్‌ పరాభవం వెనక లిక్కర్ స్కామ్ మేజర్ రోల్ ప్లే చేసింది. కేజ్రీవాల్ ఇమేజ్‌ను సగానికి పైగా డ్యామేజీ చేసింది ఆ కేసులే ! ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు ఖాయం. ఇదే కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చారు. మళ్లీ ఆ కేసును తెరిస్తే.. ఆ ఉచ్చు కారు పార్టీకి బిగుసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నది కమలం పార్టీ ఆలోచన.