Top story: ఉక్రెయిన్ లో యుఎస్ ఎంబసీని రష్యా టార్గెట్ చేసిందా ?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోందా ? ఉక్రెయిన్ కు అమెరికా అత్యాధునిక క్షిపణులు సరఫరా చేయడంతో రష్యా రగిలిపోతోందా ? అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేలా...రష్యా అడుగులు వేస్తోందా ? ఉక్రెయిన్ లోని అమెరాకి రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందా ?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోందా ? ఉక్రెయిన్ కు అమెరికా అత్యాధునిక క్షిపణులు సరఫరా చేయడంతో రష్యా రగిలిపోతోందా ? అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేలా…రష్యా అడుగులు వేస్తోందా ? ఉక్రెయిన్ లోని అమెరాకి రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందా ? ముందస్తు సమాచారంతోనే దౌత్తకార్యాలయాలను అమెరికా మూసివేసిందా ? మరిన్ని దేశాలు అదే బాటలో పయనిస్తున్నాయా ?
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అటు రష్యా…ఇటు ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడంతో…ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వెంటాడుతున్నాయి. రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగించింది. వీటిలో 5 మిసైళ్లను ధ్వంసం చేసింది రష్యా. అమెరికా చర్యలతో పుతిన్ అలర్ట్ అయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా సవరించిన కొత్త అణ్వాయుధాల ప్రయోగానికి ఆమోదముద్ర చేశారు. దీంతో రష్యా ఏ క్షణమైనా అణ్వాధాయులను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధంవైపు నెడుతుందని ఇప్పటికే రష్యా గట్టిగా హెచ్చరించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త అణ్వాయుధాల ప్రయోగానికి అనుమతి ఇవ్వడంతో…అమెరికా అప్రమత్తమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని తమ దౌత్త కార్యాలయాన్ని హుటాహుటిన ఖాళీ చేసేసింది. రాయబార కార్యాలయాన్ని తాత్కాళికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోయారు. రష్యా దాడి చేయవచ్చనే అనుమానాలతో పలు దేశాలు అమెరికా బాటలోనే పయనిస్తున్నాయి. ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలు..ఉక్రెయిన్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి. మరిన్ని దేశాలు కూడా తమ కార్యాలయాల కొనసాగింపుపై విదేశాంగ శాఖలతో చర్చలు జరుపుతున్నాయి.
అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా చర్యలు ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు నెడుతున్నాయా అనే అనుమానాలు రేకితిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నానాటికీ ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే వీటికి మరింత బలం చేరుకూరుతోంది. యుఎస్ మేడ్ ఆర్మీ టాక్టికల్ క్షిపణులు రష్యా పైకి ఉక్రెయిన్ ప్రయోగించింది . ఇప్పటికి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తూనే ఉంది. అటు నాటో కూటమిలో సభ్య దేశమైన యూకే….ల్యాండ్‌మైన్లు, పేలుడు పదార్థాలను ఎలా నిర్వీర్యం చేయాలో ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇవ్వడం పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సొంతగడ్డపై ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్ శిక్షణ ఇవ్వటంపై రష్యా రగిలిపోతోంది. అమెరికా, బ్రిటన్ నిర్ణయాలతో రగిలిపోతున్న పుతిన్… విరుగుడు మంత్రం ఆలోచించారు. నాటో దేశాలన్నీ దెబ్బకు దారిలోకి వచ్చేలా…అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ చర్యలతో అగ్రరాజ్యం అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దూకుడు తగ్గించుకోకపోతే దౌత్త కార్యాలయాలపై దాడులు చేసేలా…సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా దూకుడు తగ్గించుకోకపోతే…తీవ్ర పరిణామాలు ఉంటాయనేలా పుతిన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మరోవైపు రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని ఫిరంగి వ్యవస్థలను సరఫరా చేసింది. రష్యాకు 170ఎంఎం స్వయం తుపాకులను, 240 ఎంఎం బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను ఉత్తర కొరియా అందజేసింది. వీటిని ఉపయోగించడంపై రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి…ఆ దేశ సైనికులు వెళ్లారు. మొత్తంగా 11 వేల మంది ఉత్తరకొరియా సైనికులను రష్యాలోని కర్క్స్ రీజియన్‌లో మోహరించారు.