Top story: కొరియన్ సేనలను చంపిన డ్రోన్లు.. పుతిన్, కిమ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి?

కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్.. నియంతలకే బిగ్ బాస్ లాంటోడు. తాను అనుకున్నది జరక్కపోతే అందుకు కారణమైనవారి అంతు చూసేవరకూ నిద్రపోరు. అలాంటి కిమ్‌కు ఉక్రెయిన్ ఊహించయని షాక్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 04:37 PMLast Updated on: Dec 25, 2024 | 4:37 PM

Top Story Drones Killed Korean Soldiers What Is Putin And Kims Next Action

కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్.. నియంతలకే బిగ్ బాస్ లాంటోడు. తాను అనుకున్నది జరక్కపోతే అందుకు కారణమైనవారి అంతు చూసేవరకూ నిద్రపోరు. అలాంటి కిమ్‌కు ఉక్రెయిన్ ఊహించని షాక్ ఇచ్చింది. రష్యాకు మద్దతుగా యుద్ధ భూమిలో అడుగు పెట్టిన కిమ్ సైనికులను వెంటాడి హతమార్చింది. ఎంతమందిని పంపినా ఇదే రిపీట్ అవుద్ది అని సవాల్ చేసింది. ఇక్కడే కిమ్ ఇగో హర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలనేదానిపై పుతిన్‌తో డిస్కషన్ కూడా పెట్టారు. కానీ, ఇక్కడ అర్ధంకాని ఒకే ఒక్క ప్రశ్న.. కఠినమైన కిమ్ ట్రైనింగ్‌లో రాటుదేలిన సైనికులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారన్నదే. ఆ సీక్రెట్స్ ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

తన సైనికుల సత్తా చూసి కిమ్ మురిసిపోతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు. మూడేళ్ల క్రితం నాటిది.. నాడు మార్షల్ ఆర్ట్స్‌లో నార్త్ కొరియన్ సోల్జర్స్ కిమ్ ముందు చేసిన విన్యాసాలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన చాలా మంది ఉత్తర కొరియా కనుక యుద్ధం చేస్తే ప్రత్యర్ధి ఎవరైనా పరారవ్వాల్సిందే అని బలంగా నమ్మారు. ఉత్తర కొరియా అధినేత సైతం తన సైనికులపై అంతే నమ్మకం ఉంచారు. కానీ, అవన్నీ ఎక్స్‌పెక్టేషన్లే. రియాలిటీ ఏంటో తెలుశా?

ఇది వీడియో గేమ్ కాదు.. పబ్జీ అంతకంటే కాదు.. రియల్ వార్ జోన్‌.! పదుల సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లను ఎలా అడ్డుకోవాలో తెలీక ప్రాణ భయంతో పరుగులు తీస్తోంది ఎవరో కాదు మూడేళ్ల క్రితం మార్షల్ ఆర్ట్స్‌లో కిమ్ మన్ననలు పొందిన నార్త్ కొరియా సైనికులే. రియాలిటీ ఎంత కఠినంగా ఉంటుందో చెప్పే వీడియో ఇది. అసలు విషయానికొస్తే రష్యా తరఫున యుద్ధం చేస్తున్న కిమ్ సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని రీసెంట్‌గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇప్పటికే 3000 లకు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగిందన్నారు. కుర్స్క్‌‌లో జరుగుతున్న పోరుకు సంబంధించి ఆర్మీ కమాండర్‌ నుంచి తనకు ఈ నివేదిక అందిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ ప్రకటనను చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. కిమ్ సైనికులను చంపేంత సీన్ కీవ్‌కు లేదనీ, నార్త్ కొరియాన్లు మాన్‌స్టర్లతో సమానం అని కమెంట్ చేశారు. కట్‌చేస్తే.. కీవ్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ ఈ వీడియోను బయటపెట్టింది.

రష్యాలోని కుర్స్క్‌ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్‌ బలగాలు కమికేజ్ డ్రోన్లను వేటాడాయి. గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్‌ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై అటు రష్యా గానీ..ఇటు కిమ్‌ ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఉక్రెయిన్‌ ఆర్మీ చొరబాటును తిప్పిట్టేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా.. సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్‌లో భారీస్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులో భాగంగా మూడు గ్రామాల్లో దాదాపు 12వేల మంది కిమ్‌ సైనికులు పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం కదన రంగంలోకి దింపారు. అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో, కొరియన్‌ సేనల మధ్య సమన్వయం లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వేల మంది కొరియన్‌ సైనికులు చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని జెలెన్‌స్కీ వెల్లడించారు. అది నిజమే అనేలా డ్రోన్ వీడియోస్ బయటకు వచ్చాయి.

కిమ్ సైనికుల సత్తాపై ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ, యుద్ధంలో సత్తా ఒక్కటే సరిపోదు. అనుభవం కూడా ఉండాలి.. కిమ్ సేనల్లో లేనిదే అది. అధ్యక్షుడు ముందు మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటినంత ఈజీ కాదు.. యుద్ధం చేయడం అంటే. పైగా యుద్ధానికి దిగే ముందు తీసుకున్న ట్రైనింగ్ ఏమాత్రం సరిపోదు. అందుకే, కిమ్ సేనలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే యుద్ధభూమిలో ఉన్న వేలమంది కిమ్ సైనికుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో వెనక్కి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అదే జరిగితే నార్త్ కొరియా అధినేతకు అంతకుమించిన అవమానం మరొకటి ఉండదు. మరి కిమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తన సైనికులను వెనక్కి పిలిపిస్తారా? లేక తన మిత్రుడికోసం ప్రాణాలు పోయినా యుద్ధం చేయమని సైనికులపై ఒత్తిడి చేస్తారా? అంటే, అంతకుమించే కిమ్, పుతిన్ ఆలోచనలు చేస్తారని చెప్పొచ్చు.

సరిగ్గా ఆరు నెలల క్రితం పుతిన్ ప్యోంగ్యాంగ్‌లో పర్యటించారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన పర్యటనది. ఆ పర్యటనలో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్ ఇటీవలే ఆచరణలోకి తెచ్చినట్టు ఇరు దేశాలూ ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడో పక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుం ది. అంటే, ఇప్పటివరకూ చాటుగా పుతిన్‌కు సాయం చేస్తున్న కిమ్.. ఇప్పుడు నేరుగా సహాయం చేస్తారన్నమాట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం 12వేల మంది సైనికులను మాత్రమే రష్యాకు మద్దతుగా పంపించిన కిమ్.. ఇప్పుడు అవసరం అనుకుంటే తన సైనికులు మొత్తాన్నీ యుద్ధభూమిలో దించొచ్చన్నమాట. దానికితోడు తన దగ్గర ఉన్న ఖండాంతర క్షిపణులను కూడా మాస్కోకు తరలించడానికి అవకాశం ఉంది. అదే జరిగితే ఉక్రెయిన్ నిలవడం కూడా అసాధ్యమే. ఏది ఏమైనా తన తాజా యాక్షన్‌తో జెలెన్‌స్కీ పనికట్టుకుని కిమ్‌ను రెచ్చగొట్టారు. ఆ రిజల్ట్ ఏంటో ఉక్రెయిన్ త్వరలోనూ చూడబోతోంది.