Top story: అరాచకాలకు కేరాఫ్ గ్యాంగ్ స్టర్ నయీం
నయీం...ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో యాదికుంటంది. మంచితనంలో కాదు...క్రూరత్వంలో. తెలుగు రాస్ట్రాల్లో నయీంను మించిన క్రూరుడే లేడు. ఎందుకంటే రాక్షసులకే రాక్షసుడు. కేటుగాళ్లకు మహా కేటుగాడు.

నయీం…ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో యాదికుంటంది. మంచితనంలో కాదు…క్రూరత్వంలో. తెలుగు రాస్ట్రాల్లో నయీంను మించిన క్రూరుడే లేడు. ఎందుకంటే రాక్షసులకే రాక్షసుడు. కేటుగాళ్లకు మహా కేటుగాడు. పోలీసులైనా…పొలిటిషీయన్లు అయినా…ఈ పేరు చెబితే వణికిపోవాల్సిందే. ఒకటా…రెండా….వీడు చేసిన దుర్మార్గాలు ఎన్నో…ఎన్నెన్నో. ఓ సాధారణ వ్యక్తి గ్యాంగ్ స్టర్ గా మారితే ఎలా ఉంటుందో….నయీం చరిత్రే సాక్ష్యం. కన్ను పడిందంటే కబ్జా అయిపోవాల్సిందే. వార్నింగ్ ఇచ్చాడంటే అన్ని వదులుకోవాల్సిందే. మావోయిస్టులకే వణుకు పుట్టించిన నయీం ఆగడాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నయీముద్దీన్ ఎన్ కౌంటర్ అయి…దాదాపు పదేళ్లు అవుతోంది. అయినపుడు కంత్రీగాడు చేసిన కబ్జాలకు ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉన్న ఆస్తులను కోల్పోయారు.
మావోయిస్టులకే సవాల్
నయీమ్ అక్క పీపుల్స్‌వార్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించింది. ఆ ప్రభావంతోనే నయీమ్…మావోయిజానికి ఆకర్షితుడయ్యాడు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో గ్రైనెైట్ దాడిలో నయీమ్ తొలిసారి అరెస్టయ్యాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ గ్రూపులో చేరాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన పీపుల్స్‌వార్ అజ్ఞాతదళంలో చేరాడు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఐపియస్ అధికారి హత్య కేసులో నయీమ్ మరోసారి అరెస్టయ్యాడు. ఇదే సమయంలో తన అక్క పట్ల ఓ పీపుల్స్‌వార్ సానుభూతిపరుడు ఈదన్న…అనుసరిస్తున్న వైఖరిపై పీపుల్స్‌వార్ చర్యలు తీసుకోకపోవడంతో రగిలిపోయాడు. ఇదే అతన్ని నక్సలైట్ వ్యతిరేకిగా మారాడు. ముషీరాబాద్ జైల్లో టాప్ నక్సలైట్లు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ వంటివారితో సాహచర్యం ఏర్పడింది. జైల్లో ఉంటూనే సోదరుడు అలీముద్దిన్ ద్వారా ఈదన్నను హత్య చేయించాడు.
పోలీసుల అండతో చీకటి సామ్రాజ్యం
నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన నయీం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కోవర్టుగా మారి అనేకమంది నక్సల్స్ నాయకులను స్వయంగా హతమార్చాడు. వారి రహస్యాలను పోలీసులకు చేరవేశాడు. చిన్నచిన్న గ్యాంగ్ స్టర్లను తన గ్యాంగ్ లో కలుపుకొంటూ నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పలువురు గ్యాంగ్ స్టర్లను నయీం ముఠా…నామా రూపాల్లేకుండా చేసింది. పోలీసుల అండదండలతో చీకటి స్రామాజ్యాన్ని నెలకొల్పాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సహకరించారని ప్రచారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలుగా నయీం కంటే పెద్ద గ్యాంగ్ స్టర్ లేడు.
సెటిల్ మెంట్లు, బెదిరింపులు, కిడ్నాపులు
సెటిల్ మెంట్లు, బెదిరింపులు, కిడ్నాపులు, హత్యలతో బెంబేలెత్తించాడు. ప్రజలు, నేతలు, అమాయకులను బెదిరించి కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టారు. కిడ్నాప్ లు, హత్యలతో కోట్లు వెనకేసుకున్నాడు. అతడికి లెక్కలేనన్న భూములు, ఆస్తులు, నగదు కూడ బెట్టాడు. వందలకోట్ల విలువైన భూములను ఆక్రమించాడు. ప్రాణభయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. తన సోదరుడి హత్యలో కీలక పాత్ర పోషించిన విప్లవ గాయని బెల్లి లలితను…నయీమ్ ఫ్యామిలీ మట్టుబెట్టింది. పౌర హక్కుల సంఘం నాయకుడు పురుషోత్తమ్ హత్యలో నేరుగా నయీమ్ పాల్గొన్నాడు.
హత్య చేసి…17 ముక్కలు చేసి…
నయీం చేతిలో హతమైన వారిలో ఐపీఎస్ అధికారి వ్యాస్ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. 1993 జనవరి 27న మార్నింగ్ వాక్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేశాడు. వెంటనే పోలీసులకు లొంగిపోయి అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరి అక్కడ రక్షణగా ఉన్న పోలీసులను మస్కా కొట్టి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తంను చంపేశాడు. గాయని, మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసులో నిందితురాలు బెల్లి లలితను క్రూరంగా చంపాడు. అత్యంత కిరాతకంగా చంపి 17 ముక్కలుగా చేసి ఎక్కడెక్కడో విసిరేశారు. మాజీ మావోయిస్టు సాంబశివుడు, పరిటాల హత్య కేసులో ప్రమేయం ఉన్న పటోళ్ల గోవర్దన్ రెడ్డి వంటి వారిని నయీం హత్య చయించాడు.
25 హత్య కేసులు సహా 132కి పైగా క్రిమినల్ కేసులు
నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్…హైదరాబాద్ లోని పాతబస్తీలోని యాకత్ పురాలో 18 ఏళ్ల వయసులోనే నేరాల బాట పట్టాడు. నయీంపై 25 హత్య కేసులు సహా 132కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. కొంతకాలం అండర్ వరల్డ్ డాన్…దావూద్ ఇబ్రహీం అనుసరించాడు. ఆ తర్వాత లిబియా మాజీ అధినేత గడాఫీ స్టైల్ ను అనుకరించాడు. ఆయన లాగే మహిళలను గన్ మెన్లకు చుట్టూ పెట్టుకున్నాడు. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారి వారి నుంచి తప్పించుకోవడం నయీమ్ కు వెన్నతో పెట్టిన విద్య. 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. 2016 గత ఏడాది ఆగష్టు 8న సుమారు 12 కోట్ల విలువైన డీల్ సెటిల్ చేశాడు. ఆ తర్వాత రోజే షాద్ నగర్ లోని మిలినీయం టౌన్ షిప్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించాడు.