Top story ముఖ్యమంత్రి కుర్చీ కావాలంటే షార్ట్ కట్ జైలేనా ? పొలిటిషియన్లకు జైలు కెళ్లడం సెంటిమెంటా ?
దేశ రాజకీయాల్లో జైలు... ఇపుడు సెంటిమెంట్ అయిపోయిందా ? జైలుకు వెళ్లడానికి...పొలిటిషియన్లు సిగ్గు పడటం లేదా ? స్వాతంత్ర సమరయోధుల్లా...ఫీల్ అవుతున్నారా ? సమాజానికి...దేశానికి ఏదో ఉద్దరించమన్నట్లు బిల్డప్ ఇస్తున్నారా ? జైలుకు వెళ్లకపోతే పదవులు రావని నమ్ముతున్నారా ?
దేశ రాజకీయాల్లో జైలు… ఇపుడు సెంటిమెంట్ అయిపోయిందా ? జైలుకు వెళ్లడానికి…పొలిటిషియన్లు సిగ్గు పడటం లేదా ? స్వాతంత్ర సమరయోధుల్లా…ఫీల్ అవుతున్నారా ? సమాజానికి…దేశానికి ఏదో ఉద్దరించమన్నట్లు బిల్డప్ ఇస్తున్నారా ? జైలుకు వెళ్లకపోతే పదవులు రావని నమ్ముతున్నారా ? జనం ఎంత చీకొట్టినా…పట్టించుకోవడం లేదా ? పదవుల కోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకాడటం లేదా ?
ప్రస్తుత రాజకీయ నేతలు…ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా…ఎన్ని కోట్లు సంపాదించాం అన్నదే చూసుకుంటున్నారు. ఎన్ని కేసులు నమోదైతే ఏంటి ? ఏ సెక్షన్లు పెడితే…ఏమవుతుందా ? జైలుకు వెళ్తాం…ఎన్నాళ్లు పెడతారు ? మహా అయితే ఆరు నెలలు, సంవత్సరం…రెండేళ్లు…ఏమవుతుంది ? బెయిల్ మీద బయటకు వస్తాం…మళ్లీ అక్రమాలు చేస్తాం అంటున్నారు. సిగ్గు శరం లేకుండా జనం ముందు తాము చేసిన ఘనకార్యాలను చెప్పుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ? ఉమ్మేస్తారా ? ఛీ కొడతారా అన్నది పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. అవినీతి అక్రమాలు చేయడం జైలుకు వెళ్లడాన్ని పొలిటిషయన్లు గ్రేట్ గా ఫీలవుతున్నారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన నేతల కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు. పదవులు రావాలన్నా…సీఎం కుర్చీ కావాలన్నా…జైలే షార్ట్ అనుకుంటున్నారు. ఎలాగైనా జైలుకు వెళ్లాలి…బయటకు వచ్చిన తర్వాత సీఎం అవ్వాలన్న లక్ష్యంతో దిగజారి ప్రవర్తిస్తున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయం అంటే సేవ. స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు…రాజకీయాల్లోకి వచ్చేవారు. నిస్వార్థంతో ప్రజా సేవకే తమ జీవితాలను అంకితం చేశారు. సొంత ఆస్తులను అమ్ముకొని పేదల కోసం ఖర్చు చేశారు. దేశం కోసం, ప్రజల కోసం ఉద్యమాలు చేశారు. జైళ్లకు వెళ్లారు. ఎన్నో రకాల శిక్షలను అనుభవించారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పని చేసిన పాత తరం నేతలు..చిల్లి గవ్వ కూడా సంపాదించకోలేదు. ఊపిరి ఉన్నంత వరకు పేదల సేవకే అంకితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో గుమ్మడి నర్సయ్య, సున్నం రాజయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి లాంటి నేతలు…ఆ కోవలోకే వస్తారు. గుమ్మడి నర్సయ్యకు సొంత ఇల్లు కూడా లేదు. సున్నం రాజయ్య…ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. ఆస్పత్రులకు వెళ్తే…సాధారణ జనంలాగే క్యూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో…పొలిటిషియన్లు జైలుకు వెళ్లడాన్ని సిగ్గుగా భావించడం లేదు. ఒకసారి జైలుకు వెళ్లి వద్దాం లే…మహా అయితే కొన్ని రోజులు ఇబ్బందులు. ఆ తర్వాత అన్ని మంచి శకునములే కదా అని లెక్కలు వేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత, జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్…జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీన్నే ఇప్పుడు ఇతర నేతలు సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు. వారంతా ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలయిపోయి… ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవినీతి, అక్రమాలను ప్రజలు ఎలా తీసుకుంటున్నారు ? వారేమనుకుంటారన్నది గాలికి వదిలేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుదాం…సీఎం అవుదాం అనేలా నీచరాజకీయాలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు గార్డియన్లుగా వ్యవహరించాల్సిన వారే…పందికొక్కులు తిన్నట్లు తినేసి జైలుకు వెళ్తున్నారు. సిగ్గు లేని ప్రజలు కూడా…అవినీతి, అక్రమార్కులను గెలిపించుకుంటున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అయితే…అరెస్ట్ చేస్తే చేసుకోండి…ఏమవుతుందా ? జైలుకు వెళ్తా…జిమ్ చేసుకుంటా అంటున్నాడు. ఒక రాజకీయ నేతగా మాట్లాడాల్సిన మాటలేనా అవి. ఈ కామెంట్స్ చేయడం వెనుక సెంటిమెంట్ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు…జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత జనంలో సానుభూతి పెరిగిపోయింది. ప్రత్యర్థి పార్టీలు కక్ష కట్టి జైలుకు పంపించాయనేలా…జనంలో ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి…బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రులు అయ్యారు. కేటీఆర్ కూడా ఇదే ఫార్మూలాను ఫాలో అయి పోతున్నాడు. అరెస్టు చేస్తే జనంలో సానుభూతి వస్తుందని…అది ఎన్నికలకు ఉపయోగించుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.
హేమంత్ సోరెన్…ఈడీ కేసులో జైలు వెళ్లారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి…గెలుపొందారు. ఇపుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో… జైలుకు వెళ్లారు అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్. విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, హేమంత్ సోరెన్ లాగే…అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా…దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అంటూ సవాళ్లు విసురుతున్నాడు. మిగిలిన వారిలాగే…జైలుకు వెళ్తే తెలంగాణకు సీఎం కావొచ్చని కలలు కంటున్నాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పలువురు ముఖ్యమంత్రులు కావడంతో…కేజ్రీవాల్ విషయంలో ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా ? లేదంటే బ్రేక్ అవుతుందా ? తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తుందా ? లేదంటే కేసులతోనే సరిపెట్టుకుంటుందా అన్నది మిస్టరీగా మారింది. అరెస్టు చేసి…కేటీఆర్ ను జనంలో హీరోను చేయడం ఎందుకు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.