Top story:తల్లి చెల్లి పై జగన్ కేసు వెనక అసలు నిజం ఇది.
వైసిపి అధ్యక్షుడు జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీ లో కేస్ ఎందుకు వేశాడు? సరస్వతి పవర్ లో వాటాగా షర్మిల ,విజయమ్మ లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఎందుకు రద్దు చేసుకున్నాడు? తల్లిని చెల్లిని చీటర్స్ గా సంబోధిస్తూ నకిలీ షేర్ సర్టిఫికెట్లు సృష్టించారని అంత పెద్ద ఆరోపణ ఎందుకు చేశాడు?
వైసిపి అధ్యక్షుడు జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీ లో కేస్ ఎందుకు వేశాడు? సరస్వతి పవర్ లో వాటాగా షర్మిల ,విజయమ్మ లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఎందుకు రద్దు చేసుకున్నాడు? తల్లిని చెల్లిని చీటర్స్ గా సంబోధిస్తూ నకిలీ షేర్ సర్టిఫికెట్లు సృష్టించారని అంత పెద్ద ఆరోపణ ఎందుకు చేశాడు? అంతర్గతంగా జగన్ మాస్టర్ ప్లాన్ తెలుసుకుంటే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. తన బెయిల్ రద్దు చేయించాలన్న ఒక పెద్ద రాజకీయ కుట్రను తెలివిగా తిప్పి కొట్టాడు జగన్. నిజానికి సరస్వతి పవర్ షేర్ల గొడవ కాదు ఇది… చంద్రబాబు, జగన్ మధ్య జరుగుతున్న ఎత్తుకు పై ఎత్తు రాజకీయం ఇది.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్కు షర్మిల కు మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిలకు , జగన్కు కొన్ని ఆస్తులు వచ్చాయి. ఆ తర్వాత జగన్ సొంతంగా వ్యాపారాల్లో అపరిమితంగా,అడ్డగోలుగా సంపాదించాడు. వైయస్సార్ మరణం తర్వాత జగన్ పై సిబిఐ ,ఈడీ కేసులు నమోదయ్యాయి. జగన్ సంపాదించిన ఆస్తులు, కంపెనీలను అన్నిటినీ ఈడి అటాచ్ చేసింది. అటాచ్మెంట్ కింద ఉన్న ఆస్తులు బదిలీ చేయడం గాని, విక్రయించడం కానీ చట్ట విరుద్ధం. ఒకవేళ అలా చేస్తే జగన్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దయిపోతుంది. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ…. అమ్మ కూడదు, యెవరికీ చేయకూడదు.
జగన్ దగ్గరున్న ఆస్తులు విషయంలో అతనికి, షర్మిల కి మధ్య తల్లి విజయమ్మ సమక్షంలో ఒక అవగాహన కుదిరింది. దీనిలో భాగంగానే కొన్ని ఆస్తులను షర్మిలకు ఇవ్వడానికి జగన్ అంగీకరించారు. అయితే ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నందున నేరుగా వాటిని బదిలీ చేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున, షర్మిలకు నమ్మకం కలిగించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని జగన్ రాసిచ్చారు. అలా రాసి ఇచ్చిన ఆస్తుల్లో సరస్వతి సిమెంట్స్ కూడా ఒకటి. కేసులు nunchi ఆస్తులు బయటపడిన రాసి ఇచ్చినట్లుగా ఆ వాటాలను షర్మిల కు ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు.
సరస్వతీ పవర్ కంపెనీలో వాస్తవానికి విజయమ్మకు ఒక్క శాతం మాత్రమే వాటా ఉంది. మిగిలిందంతా… అంటే 99% జగన్ భారతీలదే. అయితే 2019లో షర్మిలకు ఇవ్వాలనుకున్న వాటాను విజయమ్మకు రాశాడు జగన్. సరస్వతీ పవర్ కంపెనీ lo 49 శాతం వాటాను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశాడు జగన్. ఆ తర్వాత జగన్ దగ్గర 29.88 శాతం, భారతికి 16.3%, క్లాసిక్ రియాలిటీ అనే సంస్థకు 4.83% వాటాలు మిగిలాయి. అయితే విజయమ్మకు 49 శాతం వాటాను ye రూపంలో బదిలీ చేయడం సాధ్యం కాదు కనుక ….ఒక హామీ ఇస్తూ ఎం ఓ యు మాత్రమే చేసుకున్నారు. స్వీయ విచక్షణతో, ప్రేమతో ఈ MOU కుదుర్చుకుంటున్నట్లు రాసుకున్నారు . ఇందులో షర్మిలకు ఎలాంటి అధికారం ఉండదన్న నమ్మకంతో ఈ ఒప్పందం జరిగింది. కోర్టులో వివాదాలు తేలేక భవిష్యత్తులో వీటిని ఇవ్వాలని అనుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం చూస్తే.. కంపెనీలో వాటాలు జగన్, భారతి, క్లాసిక్ reality పేరు నే ఉన్నాయి. కోర్టు కేసులు తేలేక షేర్లు బదలాయింపు ఉంటుందని ఒప్పందంలో క్లియర్ గా ఉంది.2021 లో రాసుకున్న గిఫ్ట్ deed లో కూడా అదే ఉంది. భవిష్యత్తులో ఈ షేర్లను జగన్ , భారతి ఆదేశాలతో మాత్రమే షర్మిలకు బదలాయించాలి. జగన్కు విజయమ్మకు కు మధ్య కేవలం ఒప్పందం జరిగిందే తప్ప ఎక్కడా షేర్లు బదిలీ కాలేదు.
అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. షర్మిల ఆస్తులు విషయంలో అన్నతో గొడవపడి ఏకంగా తెలంగాణ వచ్చి పార్టీ పెట్టింది. ఆ తర్వాత హఠాత్తుగా అక్కడ పార్టీ మూసేసి ఏపీలో కాంగ్రెస్కు అధ్యక్షురాలు అయిపోయింది. జగన్ కి,వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఎన్నికలు అయిపోయాక అసలు వ్యవహారం మొదలుపెట్టింది షర్మిల. షర్మిలకు బినామీలు, ప్రధాన అనుచరులు అయిన సతీష్, కొండలరావు సహకారంతో గిఫ్ట్ deed ని అడ్డంపెట్టి విజయమ్మ దగ్గర నుంచి షేర్లను బదిలీ చేసుకున్నారు. అంతేకాదు సర్టిఫికెట్లు కూడా సృష్టించారు .అయితే ఈ ఏడాది జూలైలో 2022– 23 ఆర్థిక నివేదికలో సరస్వతీ పవర్ లోని జగన్, భారతి షేర్లు విజయమ్మ కి బదిలీ అయిపోయినట్లు జగన్ దృష్టికి వచ్చింది .ఇది MOU కు వ్యతిరేకం. అంతేకాదు ఈడి చట్టాన్ని kuda ఉల్లంఘించడమే. కోర్టులో స్టేటస్కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఇలా షేర్లు బదిలీ అయిపోవడం అసలుకె ఎసరు తెచ్చే ప్రమాదం ఉంది. విజయమ్మకు షేర్లు బదిలీ చేసినందుకు జగన్ బెయిల్ కూడా రద్దు చేయవచ్చు. ఇది దృష్టికి రాగానే జగన్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. షర్మిల తెలిసి చేసిందో… తెలియక చేసిందో కానీ… యెవరి salaha పై chesindo కాని, షేర్ల బదిలీ వ్యవహారం గనక బయటపడితే జగన్ బెయిల్ రద్దు అయిపోవడం గ్యారంటీ. అందుకే విజయమ్మ, షర్మిల ఇద్దరిపై ఎన్సీఎల్టీలో కేసు పెట్టాడు జగన్. కేవలం వాటాల బదిలీకి ఎంవోయూ మాత్రమే జరిగిందని, గిఫ్ట్ డీడ్ మాత్రమే రాశానని ఎన్సీఎల్టీ కి తెలియజేశాడు.
తద్వారా ఈడికి కూడా సమాచారం ఇచ్చిnatlu అయింది. తాను ఉద్దేశపూర్వకంగా ఎక్కడా షేర్లు అమ్ముకోలేదని, ఎవరికీ బదిలీ చేయలేదని… ఎం ఓ యుని అడ్డం పెట్టుకొని షర్మిల విజయమ్మ షేర్ సర్టిఫికెట్లు సృష్టించారని… ఎన్సీఎల్టీ కి, ఈడికి ఒకేసారి తెలియజేసినట్లయిndi.. అంతేకాదు జగన్ బెయిల్ రద్దు ముప్పు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. ఇది జరగకపోయి ఉంటే కొద్ది రోజుల్లో ఎవరో ఒకరు ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లేవారు. తక్షణమే ఈ డి ,సి బి ఐ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయించి జైలుకి పంపించి ఉండేవి. ఎన్సీఎల్టీ లో కేసు పెట్టడం ద్వారా ఈ ఓవరాల్ గేమ్ లో జగన్ బయటపడి ఊపిరి తీసుకున్నాడు. షర్మిల కి ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి తద్వారా జగన్ ను మళ్లీ జైలుకు పంపించాలని జరిగిన రాజకీయ కుట్ర కు ఇలా తెరపడింది. అనుకున్నది జరగకపోవడంతో టిడిపి, జగన్ షర్మిల కి అన్యాయం చేశాడని…. జగన్ కి విలువలు లేవని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. కానీ అసలు విషయం ఇది.
బెయిల్ రద్దు అయి…. తిరిగి జైలుకెళ్లే దుస్థితిని తెలివిగా తప్పించుకోగలిగాడు జగన్. చంద్రబాబు నెక్స్ట్ టైం బెటర్ లక్.