Top story: చంద్రబాబు, షిండే విజయాల్లో కామన్ ఏంటి ? శివసేన విజయం వెనుక రాబిన్ శర్మ ఉన్నారా ?
చంద్రబాబు నాయుడుకు, ఏక్ నాథ్ షిండేకు...ఎన్నికల అంశంలో పొలికలున్నాయా ? ఇటు టీడీపీ, అటు షిండే శివసేన...సూపర్ విక్టరీ కొట్టడం వెనుక రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించారా ? షిండేను పేదలు, మహిళల పక్షపాతిగా చూపించడంలో...పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం సక్సెస్ అయిందా ?
చంద్రబాబు నాయుడుకు, ఏక్ నాథ్ షిండేకు…ఎన్నికల అంశంలో పొలికలున్నాయా ? ఇటు టీడీపీ, అటు షిండే శివసేన…సూపర్ విక్టరీ కొట్టడం వెనుక రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించారా ? షిండేను పేదలు, మహిళల పక్షపాతిగా చూపించడంలో…పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం సక్సెస్ అయిందా ? పార్టీ చీల్చారన్న అపవాదు నుంచి భారీగా సీట్లు సాధించడం ఎలా సాధ్యమైంది ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో…మహయుతి కూటమి తిరుగులేని విజయం సాధించింది. మహాయుతి జోరుకు ప్రతిపక్షాలు కుదేలైపోయాయి. శివసేన, ఎన్సీపీ వర్గాల్లో ఏదీ అసలైన పార్టీయో ప్రజలు తేల్చేశారు. మహాయుతి సునామీలో చిన్న చిన్న పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 233 స్థానాల్లో మహాయుతి కూటమి గెలిచింది. బీజేపీ 132 స్థానాల్లో జయభేరి మోగిస్తే…ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో జెండా ఎగురవేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాఢీ నామమాత్రంగానే ప్రభావం చూపింది. ఎంవీఏ 51 స్థానాల్లో గెలిచింది. ఎంవీఏలో శివసేన యూబీటీ 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ ఎస్పీ 10 చోట్ల విజయం సాధించాయి.
స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ…ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏక్ నాథ్ షిండ్. అదే శివసేనతో పాటు మహయుతి పార్టీలకు కలిసి వచ్చేలా చేసింది. మొన్నటి హరియాణా ఎన్నికల్లో లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు 2100 రూపాయలు ఇస్తామని, హక్ ఘర్ గృహిణి యోజన కింద 500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని చెప్పింది. దీంతో ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం…మధ్య తరగతి మహిళల్లో సానుకూలత తీసుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే అనేక అంశాల్లో పోలికలు ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ కోసం రాబిన్ శర్మకు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ…షో టైం పని చేసింది. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తే…ఏకంగా 135 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. ఇన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే రాలేదు. 90 పర్సెంట్ కు పైగా స్ట్రైట్ రేటు నమోదు చేసింది. స్థానిక సమస్యలను ప్రస్తావించడం ఉచిత సిలిండర్, ఫ్రీ బస్సు పేరుతో మహిళలను ఆకట్టుకునే విధంగా పథకాలను రూపొందించారు. ఇది ఏపీలో గ్రాండ్ సక్సెస్ అయింది. కూటమికి తిరుగులేని మెజార్టీ తీసుకొచ్చింది.
తాజాగా మహారాష్ట్రంలోనూ..రాబిన్ శర్మ పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైమ్…మ్యాజిక్ చేసింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పార్టీకి రాజకీయ సలహాలు ఇచ్చింది. ప్రచారం నుంచి వ్యూహాల అమలు, సోషల్ మీడియా, స్థానిక సమస్యలు, నిరుద్యోగులు, మహిళల వంటి అంశాలపై ప్రత్యేకంగా పిక్చర్ ను తయారు చేసింది. ఎన్నికల ముందు లడ్కీ బెహన్ పేరుతో మహిళలకు నగదు బదిలీ పథకం సలహా ఇచ్చింది. ఈ పథకంపై మహిళల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పటి దాకా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా…ఈ పథకం ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది. అంతేకాకుండా ప్రజల్లో షిండేను మ్యాన్ ఆఫ్ ది మాసస్ గా చూపించడంలో షో టైం సక్సెస్ అయింది. షిండే శివసేన 81 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే…ఏకం 57 సీట్లను గెలుచుకుంది. 70 శాతం స్ట్రైక్ రేటును నమోదు చేసింది.
రాబిన్ శర్మ పొలిటికల్ కన్సల్టెన్సీ వ్యూహాలు రెండు రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు వచ్చేలా చేశాయి. దీంతో ఇపుడు రాబిన్ శర్మ పేరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. షో టైం సంస్థ…భవిష్యత్ లో మరిన్ని పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికలకు కన్సల్టెన్సీగా వ్యవహరించే అవకాశం ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.