Top story : త్వరలో కూటమికి పవన్ గుడ్ బై చెప్తారా…?
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజంట్ హాట్ టాపిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత ప్రభుత్వంపైనే పవన్ ఫైర్ అవుతున్న తీరు కొత్త సంకేతాలు రేపుతోంది. ఆయన కూటమి నుంచి బయటకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్త బాంబ్ లా పేలుతోంది.సేనాని సంకేతాలు టీడీపీ, బీజేపీకి షాక్ లా తగిలాయి. ఇంతకీ అసలేం జరగబోతోంది. ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిది...?
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజంట్ హాట్ టాపిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత ప్రభుత్వంపైనే పవన్ ఫైర్ అవుతున్న తీరు కొత్త సంకేతాలు రేపుతోంది. ఆయన కూటమి నుంచి బయటకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్త బాంబ్ లా పేలుతోంది.సేనాని సంకేతాలు టీడీపీ, బీజేపీకి షాక్ లా తగిలాయి. ఇంతకీ అసలేం జరగబోతోంది. ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిది…?
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన కూటమి నుంచి బయటకు వస్తారని పొలిటికల్ పండిట్స్ డిసైడైపోయారు. ఆ మధ్య అనిత ఎపిసోడ్ తో మొదలుకొని నిన్న కాకినాడలో ఎమ్మెల్యేపై మండిపడటం వరకూ ఎనలైజ్ చేస్తే పవన్ వ్యూహాత్మక స్టెప్స్ రియలైజ్ కావొచ్చంటున్నారు. కూటమి నుంచి బయటకు రావాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. త్వరలో కూటమి నుంచి బయటకు వచ్చి టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలే పవన్ కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి దిగారు.
పవన్ ప్రతి యాక్షన్ వెనక ఓ కారణం ఉంది. హోంమంత్రి అనిత తీరుపై ఆయన ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అనిత ఆయన్ను కలిసి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. పవన్ ప్రశ్నించాలనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు. కానీ మీడియా ముందు అసంతృప్తి వెళ్లగక్కడానికి కారణం వేరేగా ఉంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా పవన్ మాట్లాడిన తీరు చంద్రబాబుకు కూడా మింగుడు పడలేదు. సోషల్ మీడియాలో తనపై, తన కూతుళ్లపై తప్పుడు రాతలు రాస్తుంటే అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నానన్న పవన్ ఆవేదన అందరికీ అర్థమైంది. ఆ తర్వాతే సోషల్ సైకోలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇక కాకినాడ ఎపిసోడ్ ను కూడా తన స్క్రీన్ ప్లే ప్రకారమే నడిపారు పవన్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆయన టార్గెట్. అధికారపార్టీలో కొందరు ఆయనకు అండగా ఉన్నారని పవన్ అనుమానిస్తున్నారు. ఇన్ని లక్షల టన్నుల బియ్యం దేశం దాటిపోతుంటే తనలాంటి వాళ్లు వచ్చి పట్టుకోవాలా అన్నది పవన్ ప్రశ్న. ఆ సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుకు చురకలు వేశారు. దీంతో అధికారపార్టీలో కొందరు ద్వారంపూడితో లాలూచీ పడ్డట్లు చెప్పకనే చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి పవన్ పై చెలరేగిపోయారు. బియ్యం అక్రమ రవాణాతో వేలకోట్లు సంపాదించారని అందులో అప్పటి సీఎం జగన్ కు కూడా వాటా వెళ్లిందన్నది ఆరోపణ. ఇప్పుడు ఓడిపోయాక కూడా ద్వారంపూడి దర్జాగా తన దండా చేస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటనేది పవన్ ప్రశ్న. ద్వారంపూడిని ఇంతలా టార్గెట్ చేయడం వెనక మరో విషయం కూడా ఉంది. అప్పట్లో పవన్ పైకి కాపు నేత ముద్రగడను ప్రయోగించారు జగన్. కాపులు పవన్ వెనక నడవకుండా ముద్రగడ శతధా ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్ వెనక ఉన్నది ద్వారంపూడే అని పవన్ నమ్మకం. అనిత ఎపిసోడ్ కావచ్చు, కాకినాడ ఎపిసోడ్ కావచ్చు పవన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత ప్రభుత్వమైనా సరే ప్రశ్నించడం మాననని స్పష్టంగా చెబుతున్నారు. పవన్ అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే టీడీపీ నేతలే అడ్డు పడుతున్నారనేలా జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. జనంలో చర్చ జరిగేలా చూస్తున్నారు. పవన్ కేవలం హోంమంత్రి పోస్టు కోసమే ఇలా చేస్తున్నారని కొంతమంది చెబుతున్నా…. దానికోసం ఇంత డ్రామా అవసరం లేదు.
భవిష్యత్ రాజకీయ అవసరాలతో పవన్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్నది స్పష్టం. గత ఎన్నికల్లో పవన్ 21సీట్లలో పోటీ చేసి అన్నిచోట్లా విజయం సాధించారు. 100పర్సంట్ స్ట్రైక్ రేట్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి పనిచేయాల్సి వస్తే 21సీట్లతో సరిపెట్టుకోలేని పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో అంటే వైసీపీని దించడానికి రాజీ పడ్డానని చెప్పుకున్నారు. ఇప్పుడు అలా కుదరదు. కనీసం 50-60 స్థానాలైనా అడగాల్సి ఉంటుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ అన్ని ఇస్తుందా అంటే డౌటే. ఈసారీ రాజీ పడితే పార్టీ ఎదగదు. కాబట్టి టీడీపీతో సున్నం పెట్టుకుని సరైన సమయంలో బయటకు రావడమే మంచిదనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. తాను కూటమి నుంచి బయటకు వస్తే ప్రజల కోసమే బయటకు వచ్చాననేలా కనిపించేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
పవన్ బయటకు వస్తే ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. స్పష్టమైన మెజారిటీ ఆ పార్టీకి ఉంది. అయితే నైతికంగా మాత్రం అది టీడీపీకి గట్టి షాక్ అవుతుంది. ఇక వైసీపీ జాతకం అసలు బాగోలేదు. దాన్ని ఎంత తొక్కాలో అంత తొక్కే పని చంద్రబాబు చేస్తారు. అంటే వైసీపీ బలహీనపడుతుంది. ఆ సమయంలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించేది ఒక్క జనసేన మాత్రమే. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పవన్. తనకు ఎలాగూ కాపుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తన చర్యల ద్వారా న్యూట్రల్ ఓటర్లను కూడా తనవైపు తిప్పుకుంటున్నారు. హిందుత్వ పేరుతో ఓట్లను పోలరైజే చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కలసి వస్తే వచ్చే ఎన్నికల నాటికి తానే నిర్ణాయక శక్తిగా ఎదగాలన్నది పవన్ ప్లాన్. ఈ కథంతా నడపడానికి బీజేపీ పెద్దల మద్దతు కూడా ఉందన్నది కొందరి అనుమానం. అది నిజం కావచ్చు కూడా. మోడీ, అమిత్ షాకు తెలియకుండా పవన్ ఏమీ చేయరు.
వారి గ్రీన్ సిగ్నల్ తోనే పవన్ తన దూకుడును అంతకంతకూ పెంచుతున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ కథనం. ఏపీలో సొంతంగా బలపడేంత సీన్ బీజేపీకి లేదు. అసలు ఆ పార్టీకి నాలుగు ఓట్లు రాబట్టేనాయకుడే లేడు. ఇటు చూస్తే చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. జగన్ ను ప్రోత్సహిస్తే తమ పార్టీ ఎదగదు. పైగా జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలు ఇబ్బంది పెడతాయి. బీజేపీకి కనిపిస్తున్న పెద్ద క్రౌడ్ పుల్లర్ పవన్ మాత్రమే. జనసేనానికి ఉన్న పొటెన్షియాలిటీని గమనించే బీజేపీ పెద్దలు ఆయన్ను అంత గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు పవన్ ను ప్రోత్సహించి, కూటమి నుంచి బయటకు లాగి ప్రత్యామ్నాయశక్తిగా ప్రజల ముందు ప్రొజక్ట్ చేయాలన్నది బీజేపీ ఆలోచన కావచ్చు. ఆ తర్వాత పవన్ ను తమలో కలుపుకోవచ్చు. మొన్నటి ఢిల్లీ టూర్ లో పవన్ కు కమలం పెద్దల నుంచి దూకుడు పెంచమని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగమే కాకినాడ ఎపిసోడ్. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అంటే ఉన్నది రెండేళ్లే. ఈ లోపే వైసీపీని ఎదగకుండా చేసి పవన్ ను ఆల్టర్ నేటివ్ గా ప్రొజక్ట్ చేయగలిగితే బీజేపీ ప్లాన్ సక్సెస్ అయినట్లే. మొత్తంగా చూస్తే పవన్ కూటమి నుంచి బయటకు వస్తారు అనడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి అది నిజమవుతుందా…అంటే వెయిట్ చేయాల్సిందే.