పవన్ పేషీలో అలజడి, ఏం జరిగింది…?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీలో అలజడి రేగింది. బదిలీల వ్యవహారంలో మీడియాలో వచ్చిన కథనాలు ఒక్కసారిగా కంగారు పెట్టాయి. బదిలీల ప్రక్రియపై వార్తా కథనాలను పవన్ దృష్టికి అధికారులు తీసుకెళ్ళారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీలో అలజడి రేగింది. బదిలీల వ్యవహారంలో మీడియాలో వచ్చిన కథనాలు ఒక్కసారిగా కంగారు పెట్టాయి. బదిలీల ప్రక్రియపై వార్తా కథనాలను పవన్ దృష్టికి అధికారులు తీసుకెళ్ళారు. వార్తా కథనాల్లో ప్రస్తావించిన అంశాలపై పవన్ ఆరా తీసారు. విమర్శలు వచ్చిన పోస్టింగ్స్ ఇవ్వడానికి గల కారణాలను పవన్ కు పేషీ అధికారులు వివరించారు.
డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సి.ఈ.ఓ., డి.ఎల్.డి.ఓ. బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృ శాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేసారు. తగిన పోస్టింగ్స్ ఇవ్వడం… అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేయడంపట్ల పై పవన్ సంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదం సద్దుమణిగింది.