తమిళ సినిమా యాక్టర్స్ కు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా వాళ్ళే రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. తమిళనాడు ను పరిపాలించిన ముఖ్యమంత్రి లు అందరికీ దాదాపుగా సినిమా పరిశ్రమతో లింకుంది. కరుణానిధి ఆ తర్వాత ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా మరి కొంతమంది నటులు రాజకీయాలపై ఆసక్తి చూపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కెప్టెన్ విజయ్ కాంత్ పెద్దగా రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. ఐదేళ్ల క్రితం రాజకీయ పార్టీ స్థాపించిన స్టార్ హీరో కమలహాసన్ కూడా రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేకపోయారు. వీళ్ళిద్దరూ తమ పార్టీలను సమర్ధవంతంగా తమిళ రాజకీయ ముఖచిత్రం పై నిలపలేక ఫెయిలయ్యారు. హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇటీవల ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. ఇలా సినిమా వాళ్ళందరూ దాదాపుగా రాజకీయాల్లో అక్కడ హడావుడి చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు సంపాదిస్తూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని ముందు ప్లాన్ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ స్టెప్ వేశారు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేశాడు. విల్లుపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానంటూ ప్రకటించాడు. ఈ స్టార్ హీరో సినిమాలతో బిజీగా ఉన్నా సరే రాజకీయాల్లోకి రావడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. రెండేళ్లలో తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని విజయ్ పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఎన్నికలపై విజయ్ ఫోకస్ పెడతాడు. ఇదే టైంలో మరో నటి కూడా రాజకీయాల్లో ఆసక్తి ఉందంటూ ప్రకటన చేసింది. స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాల నుంచి సినిమాల్లో కొనసాగుతోంది. ఈమెకు అక్కడ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ ఫాలోయింగ్ వాడుకోవాలని త్రిష వర్కౌట్ మొదలుపెట్టింది. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజాసేవ చేయాలని ప్రజలతో మమేకం కావాలని తన కోరిక అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ సినిమా సర్కిల్స్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హార్ట్ టాపిక్ అవుతున్నాయి. మరి కొంతమంది అయితే ఈమె విజయ్ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని త్వరలోనే విజయ్ సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అవ్వబోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=5Gab1fXwhjc[/embed]