ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ ,భారత్ లక్ష్యంగా పాకిస్తాన్‌తో దోస్తీ…!
డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చీ రాగానే పాకిస్తాన్‌కు అన్ని రకాల సహాయాలు నిలిపేసిన ట్రంప్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచంలో ఎవరికీ చేయని రక్షణ సహాయం ఇస్లామాబాద్‌కు చేస్తున్నారు. అదికూడా భారత్ రక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి. ఇక్కడే ట్రంప్ డబుల్ గేమ్ బయటపడుతోంది. ఇంతకూ, ఇండియాతో ట్రంప్ ఆడుతున్న గేమ్ ఏంటి? ఇస్లామిక్ దేశాలు కూడా పూర్తిగా పక్కనపెట్టేసిన రోగ్ కంట్రీ పాకిస్తాన్‌కు ఎలాంటి సాయం చేస్తున్నారు? ఆ సాయంతో మన దేశానికి ఎదురయ్యే సవాళ్లేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం టాప్ స్టోరీలో చూద్దాం..
2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా ఇదే టెంపర్ చూపించారు. మిగిలిన దేవాల మాట ఎలా ఉన్నా.. పాకిస్తాన్‌కు కంటి మీద కునుకులేకుండా చేశారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గానూ పాకిస్తాన్‌కు ఇవ్వదలచిన 17 వందల కోట్ల నిధులను ట్రంప్ ఆపేశారు. తామిస్తున్న నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరుకి కాక.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాడుతోందని అంతర్జాతీయ సమాజం ముందే కడిగిపారేశారు. ట్రంప్ మొదటి పాలనలో ఇస్లామాబద్‌కు ఏకంగా 17వేల 242కోట్ల సైనిక సాయాన్ని నిలిపేశారు. కానీ, 2020లో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక సాయం చేశారు. 2024 ఇస్లామాబాద్‌కు 16 మిలియన్ డాలర్లు అంటే 138 కోట్లు పౌరసాయంగా అందించారు. అంతకు ముందే 2022-23లో ఏటా 80 మిలియన్ డాలర్లు అంటే 690 కోట్లు పౌర సహాయంగా అందించారు. కానీ, మళ్లీ ట్రంప్ గెలవడంతో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. అనుకున్నట్టే ట్రంప్ పాకిస్తాన్‌కు అన్ని రకాల సహాయాలు నిలిపేశారు. కానీ అదంతా గతం. ట్రంప్ యాక్షన్ ఇప్పుడు మారింది.
ప్రపంచంలో ఏ దేశానికి సాయం చేయాల్సిన అవసరం తనకు లేదని ఇప్పటివరకూ చెప్పిన ట్రంప్.. ఇప్పుడు తానే పాకిస్తాన్‌కు సైనిక సహాయ ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అక్షరాలా 3వేల 484 కోట్ల రూపాయలు ఇస్లామాబాద్‌కు ఇస్తున్నారు. ఈ నిధుల్ని పాకిస్తాన్‌కు ఎప్పుడో విక్రయించిన ఎఫ్-16 ఫైటర్ జెట్ల భారాన్ని భరించేందుకు పాకిస్తాన్ వినియోగించబోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర 85 ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. డీటెయిల్డ్‌గా చెప్పాంటే.. ఎఫ్-16 ఫైటర్ జెట్ల నిర్వహణ, మరమ్మతులు, పర్యవేక్షణ కోసం పాకిస్తాన్‌కు అమెరికా సాయం అందించిందన్న మాట. ఎఫ్-16 ఫైటర్ల నిర్వహణకే నిధులు ఎందుకు కేటాయించారంటే.. ఈ యుద్ధ విమానాలతో ఉగ్రవాదంపై పాకిస్తాన్ పోరాడు తుందని. తన ఫస్ట్ టర్మ్‌లో అమెరికా ఇస్తున్న నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరుకు కాక ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి ఖర్చు చేస్తోందని ఆరోపించిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ మారిపోయిందని నమ్ముతున్నారు. నిజమేంటంటే అప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ మారలేదు.. మారబోదు కూడా. ఈ నిజం ట్రంప్‌కు ఎందుకు అర్ధం కావడం లేదు? లేక కావాలనే పాకిస్తాన్‌కు సహాయం చేస్తున్నారా? అన్నింటికీ మించి పాకిస్తాన్‌కు ట్రంప్ మిలటరీ ప్యాకేజీని కేటాయించడంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
టెక్నికల్‌గా పాకిస్తాన్ తన వద్ద ఉన్న ఎఫ్-16 ఫైటర్లను కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలి. భారత్‌కు వ్యతిరేకంగా ఈ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ఉపయోగించకూడదు. కానీ, ఈ నియమాన్ని కఠినంగా ఆ దేశం అమలు చేయడం లేదు. 2019లో ఎఫ్-16 ఫైటర్ జెట్లను భారత్‌పై ఎక్కు పెట్టింది. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఇండియాపైకి పాకిస్తాన్ ఎఫ్-16 ఫైటర్లను దించింది. అందులో ఒక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. ఈ నిజం ట్రంప్‌కు కూడా తెలుసు. అయినా ఆ దేశానికి సాయం చేశాడంటే పరోక్షంగా ఇండియాకు వార్నింగ్ ఇచ్చారని అర్ధం. భారత్ విషయంలో ట్రంప్ పాజిటివ్‌గా ఉంటారని భావించినా.. ట్రంప్‌తో ఏదీ అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని ఇండియాకు చెప్పాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. అమెరికాను తేలిగ్గా తీసుకుంటే పాకిస్తాన్ పావుగా వాడతానని తాజా సైనిక సాయం ద్వారా హింట్స్ ఇస్తున్నారనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మోడీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నదే అసలు పాయింట్.