Top story: మీ ఇండియన్ల తాట తీస్తా: ట్రంప్, వీడేంట్రా బాబు మనపై పడ్డాడు
ఈ ట్రంప్ ఉన్నాడే... మొండోడు... అసలు మాట వినడు.. అనుకున్నది చేస్తాడు... ఒక్కొక్కరిపై ఒక్కో మిస్సైల్ వేస్తున్న ఈ పెద్దాయన ఈసారి ఇండియాను టార్గెట్ చేశాడు. కోరి కయ్యానికి కత్తి దూస్తున్నాడు. ఇండియాపై ప్రతీకార పన్నులు పెంచబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ ట్రంప్ ఉన్నాడే… మొండోడు… అసలు మాట వినడు.. అనుకున్నది చేస్తాడు… ఒక్కొక్కరిపై ఒక్కో మిస్సైల్ వేస్తున్న ఈ పెద్దాయన ఈసారి ఇండియాను టార్గెట్ చేశాడు. కోరి కయ్యానికి కత్తి దూస్తున్నాడు. ఇండియాపై ప్రతీకార పన్నులు పెంచబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. మాములుగా కాదు బాదుడే బాదుడు.. నేను రాగానే మీ సంగతి తేల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ట్రంప్ కు మనమంటే ఎందుకంత కోపం…? ఇన్ని దేశాలు ఉండగా మనపైనే ఎందుకు పడుతున్నాడు….? అంతగా మనపై గొంతు చించుకోవాల్సిన అవసరం ఏంటి…? ఐదేళ్లు మనకు కష్టాలు తప్పవా…?
నిన్నటిదాకా ఇమ్మిగ్రెంట్స్‌పై పడ్డాడు… వారిని వెళ్లగొడతానని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇండియన్స్‌కు గుండెదడ పట్టుకుంది. అందరూ ఆ టెన్షన్‌లో ఉండగానే ఇప్పుడు ఏకంగా దేశాన్నే పన్నుల ఉచ్చులోకి నెట్టాడు. భారత్‌పై ప్రతీకారపన్ను విధించబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ పన్నులేస్తోందన్నది ట్రంప్ ఆరోపణ… అందుకే మీరు మాపై రూపాయి వేస్తే మేమూ మీపై రూపాయి పన్ను వేస్తాం అంటున్నాడు ట్రంప్. పన్నుల విషయంలో బైడెన్ సర్కార్ భారత్‌తో కాస్త సయోధ్యతోనే వ్యవహరించింది. కానీ ట్రంప్ అలా కాదు.. కెలికి కెలికి మరీ కంపు చేస్తానంటున్నాడు.
అధికారంలోకి రాగానే భారత్‌పై పన్నులు పెంచేస్తానని తేల్చేశారు ట్రంప్. గతంలో ఎన్నికల ప్రచారంలో భారత్‌పై పన్నులు పెంచుతానని హెచ్చరికలు చేశాడు. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక పన్నులు తప్పవన్నాడు. అంతేకాదు నవ్వుతూనే భారతీయులు అమెరికా ఉత్పత్తులపై పన్నులు వేస్తారని.. కానీ తమ ఉత్పత్తులపై మాత్రం పన్నులు పడకుండా బీద అరుపులు అరుస్తారన్నట్లు వెటకారాలాడాడు అమెరికా కొత్త ప్రెసిడెంట్. ఇప్పుడు గెలిచాక కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో మనల్ని ఏం చేయబోతున్నాడో దాదాపు అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఐదేళ్లు పిచ్చోడితో తిప్పలు తప్పవని స్పష్టత వచ్చేసింది. ఐదేళ్ల ఫ్యూచర్ కళ్లముందు కనపడుతోంది.
ట్రంప్ కోపం ఇప్పటిది కాదు… 2016లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనమేదో అమెరికన్ల సొమ్ము దోచుకుతింటున్నట్లు తెగ బాధపడిపోతున్నాడు. గతంలో మనం హార్లే డేవిడ్‌సన్ బైక్‌లపై వందశాతం పన్ను వేశాం. దీంతో ఆ కంపెనీ ట్రంప్‌కు మొరపెట్టుకుంది. దాన్ని సాకుగా చూపి అప్పట్నుంచి మనల్ని వేధించడం మొదలుపెట్టాడు ట్రంప్. నోరు తెరిస్తే చాలు హార్లే డేవిడ్ సన్ అంటాడు. 2019లో భారత్‌ను టారిఫ్ కింగ్ అంటూ అడ్డగోలు ఆరోపణలు చేశాడు. అంతేకాదు GSP అంటే జనరలైడ్జ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద మినహాయింపులు రద్దు చేశాడు. ఈ హోదా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతులు చేయవచ్చు. ట్రంప్ నిర్ణయానికి ప్రతీకారంగా మనం అమెరికా ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచాం. బైడెన్ సర్కార్ వచ్చాక మళ్లీ పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. GSP హోదాను పునరుద్దరించాలని మనం బైడెన్ సర్కార్‌ను కోరుతున్నాం. దానిపై సానుకూల చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మళ్లీ మనకు ఊరట దక్కుతుందనుకున్న సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరిగి మళ్లీ తెంపరి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. రాగానే పాత కత్తికే కొత్తగా పదును పెట్టి మళ్లీ మనపై పడబోతున్నాడు. వాళ్లు వందశాతం పన్ను వేస్తే మేము కూడా వందశాతం పన్ను వేస్తామని స్పష్టం చేశారు ట్రంప్. మీరు మాకేమిస్తే మీకూ మేము అదే ఇస్తామని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి కాబోతున్న హోవార్డ్ లుత్నిక్ కూడా ఇదే మాట మాట్లాడాడు.
గతంలో అమెరికాకు భారత్ ఉత్పత్తుల ఎగుమతి తక్కువ ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు బలపడ్డాయి. గత ఆర్ధిక సంవత్సరంలో మనం అమెరికా నుంచి 42.2 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాం. మనం 77.52 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి చేశారు. ఇక ఈ ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు మన ఎగుమతుల విలువ 120 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ వాటిపై పడనుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న సమయంలో ట్రంప్ నిర్ణయం మన ఎగుమతిదారులను దెబ్బ తీయనుంది. వస్తువులే కాదు మనం అమెరికాకు సేవలు కూడా అందిస్తున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ పన్ను పరిధిలోకి తెస్తే వాటి ప్రభావం దేశీయ కంపెనీలపై భారీగా పడుతుంది. ఎక్కువగా అమెరికాపై ఆధారపడే ఐటీ, ఫార్మా, టైక్స్ టైల్స్ పై భారీ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ట్రంప్ చైనాపై కాస్త కఠిన వైఖరి అవలంభిస్తారని భావించారు. అది మనకు అవకాశాలను సృష్టిస్తుందని వాటిని అందిపుచ్చుకుంటే లాభాల పంటేనని భావించారు. ఇప్పటికీ ఆ అవకాశం ఉంది. కానీ మనపై సుంకాలు పెంచితే అవకాశాలు వచ్చినా అంతగా ఉపయోగం ఉంటుందా అన్న అనుమానాలున్నాయి. గతంలో ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్ కు దిగినప్పుడు మన కంపెనీలు ఆ గ్యాప్ ను ఫిల్ చేశాయి. ఇప్పుడు ట్రంప్ పన్నులు పెంచితే మరో సమస్య కూడా ఉంది. అమెరికన్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయి. దీని ఎఫెక్ట్ మన అభివృద్ధిపై కూడా పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అమెరికా ఉత్పత్తులపై మనం పన్నులు తగ్గించాలి. అది కూడా మనల్ని దెబ్బతీసేదే. గతంలో కూడా మోడీ ప్రభుత్వం ఇద్దరి శత్రువు చైనాను చూపించి అమెరికా కఠిన ఆంక్షల నుంచి తప్పించుకుంది. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. దీంతో పాటు ఇతర మార్కెట్లను కూడా సృష్టించుకోవాలని అమెరికా ఆధారపడటాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ మన ఉత్పత్తులపై పన్నులు పెంచితే ప్రత్యామ్నాయ మార్కెట్లు కాపాడతాయని సూచిస్తున్నారు. మరి దీన్ని మోడీ ప్రభుత్వం ట్రంప్ థ్రెట్ ను ఎలా ఎదుర్కొంటుందన్నది కూడా చూడాల్సి ఉంది.