ట్రంప్ టూ పవన్, 2024 పొలిటికల్ సెన్సేషన్స్ లిస్టు ఇదే…
2024 దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ట్రంప్ ఎన్నిక కావడం... ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడం... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం వంటివి ఈ ఏడాది నమోదు అయ్యాయి.
2024 దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ట్రంప్ ఎన్నిక కావడం… ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడం… ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం వంటివి ఈ ఏడాది నమోదు అయ్యాయి. 2024 భారత్ సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి అనే చెప్పాలి. వరుసగా రెండుసార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా అనే సందిగ్ధతలో పలు దేశాలు అధినేతల కూడా ఉన్నారు.
ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాకూడదు అని కొంతమంది ఎదురు చూస్తే ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు మాత్రం మరోసారి మోడీ అధికారంలోకి రావాలని ఆశగా ఎదురు చూశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నేతగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే 2024 ఎన్నికల్లో బిజెపి సొంతగా అధికారంలోకి రాలేకపోయింది. 2019లో భారీ మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఎన్డీఏ మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి రావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అలాగే బీహార్లో నితీష్ కుమార్ సహకారంతో బిజెపి మళ్ళీ అధికార పీఠంపై కూర్చుంది. చంద్రబాబు నాయుడు విషయంలో బిజెపి పెద్దగా కంగారు పడకపోయినా నితీష్ కుమార్ ఏం చేస్తారనే దానిపైనే ఆసక్తి నెలకొంది. అయితే నితీష్ కుమార్ ను బిజెపి పెద్దలు కాస్త కూల్ చేశారని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా సంచలనమైనది.
జగన్ లాంటి బలమైన నాయకుడు ఆ స్థాయిలో ఓడిపోవడం పట్ల చాలామంది విస్మయ వ్యక్తం చేశారు. 40% ఓట్ షేర్ వచ్చిన సరే జగన్ ఆ రేంజ్ లో ఓడిపోతారని ఎవరు ఊహించలేదు కూడా. ఈ ఎన్నికల్లో కేకే సర్వే సంచలన విషయాలు చెప్పింది. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని 165 సీట్ల వరకు ఆ పార్టీలు గెలిచే అవకాశం ఉందని కేకే సర్వే ప్రకటించింది. చెప్పినట్లుగానే వైసిపి ఘోరంగా ఓడిపోవటం, కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది.
తొలిసారి జనసేన పార్టీ స్థాపన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. ఇక ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. అటు జనసేన పార్టీ ఎంపీలు కూడా విజయం సాధించారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంటు సీటు రాకపోవడం కూడా సంచలనమైంది. భారతీయ జనతా పార్టీ ఏకంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకుని సంచలనం నమోదు చేసింది.
ఇక ఏడాది జరిగిన హర్యానా మహారాష్ట్ర జమ్మూకాశ్మీర్ ఎన్నికలు కూడా సంచలనంగానే మిగిలాయి. హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సర్వే సంస్థల అంచనా వేసాయి. అవన్నీ కూడా బిజెపి దూకుడు ముందు నిలవలేకపోయాయి. తిరిగి హర్యానాలో బిజెపి అధికారం పీఠంపై కూర్చుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అందరూ అంచనా వేసినట్టుగానే మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదానిపై చివరి వరకు స్పష్టత రాలేదు.
ఎన్నికలు ఫలితాలు వచ్చిన సరిగ్గా 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పై స్పష్టత వచ్చింది. బిజెపి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని పట్టుదలగా ఉండటంతో అజిత్ పవర్, ఏకనాథ్ షిండే ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇలా ఈ ఏడాది రాజకీయం పరంగా ప్రతి ఒక్కటి సంచలమైంది అనే చెప్పాలి