MLC ELECTIONS: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమేనా.. అధికారిక ప్రకటనే తరువాయి..?
జనవరి 29న రెండు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రెండు స్థానాలకు కలిపి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, అధికారిక ప్రకటన ఈ నెల 22 సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.

MLC ELECTIONS: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం కాంగ్రెస్ తరఫున పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ నుంచి నామినేషన్లు వేశారు. ఇప్పటికే నామినేషన్ల గడువు పూర్తైంది.
Ashika Ranganath: చీరకట్టుతో ఒక క్లిక్.. అషికా రంగనాథ్ ట్రెడిషనల్ ఫొటోస్..
శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22వ తేదీ సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ లోపు పోటీలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నిక జరగాలి. దీని ప్రకారం జనవరి 29న రెండు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రెండు స్థానాలకు కలిపి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, అధికారిక ప్రకటన ఈ నెల 22 సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తైన అనంతరం, ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాలను వెల్లడిస్తారు. రెండు స్తానాలకు మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఖాయమైంది. గతంలో ఈ రెండు స్థానాల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఉండేవాళ్లు. కానీ, ఈ ఇద్దరూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. ఫలితంగా రెండు స్థానాలు ఖాళీ కావడంతో, ఉప ఎన్నిక జరుగుతోంది.
మహేశ్‌కుమార్ గౌడ్ స్థానంలో అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో, అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో అద్దంకిని కాదని.. మహేశ్‌కుమార్ గౌడ్‌కు టిక్కెట్ కేటాయించింది కాంగ్రెస్. అయినప్పటికీ.. అద్దంకి.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కాంగ్రెస్ తనకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.