Udhayanidhi Stalin: నా తల తీసే దమ్ముందా..? స్వామీజీకి ఉదయనిధి కౌంటర్..
ఉదయనిధిపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉదయనిధి తల నరికి తెచ్చినవాళ్లకు రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు.

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూ సమాజం మండిపడుతోంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయనిధిపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఉదయనిధి తల నరికి తెచ్చినవాళ్లకు రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు. ఉదయనిధి ఫొటోను తల్వార్‌తో నరికేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్వామీజీ వ్యాఖ్యలకు మంత్రి ఉదయనిధి కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులు తన జీవితంలో చాలా చూశానంటూ చెప్పారు. తనను చంపడానికి రూ.10 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని.. తల దువ్వుకోడానికి 10 రూపాయలు పెట్టి దువ్వెన కొనివ్వండి అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడ్డా తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదన్నారు ఉదయనిధి. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలన్నదే ద్రవిడ మోడల్ అంటూ చెప్పారు ఉదయనిధి. తాను అదే నియమానికి కట్టుబడి పనిచేస్తానంటూ చెప్పారు. ఈ వ్యవహారంతో తనపై న్యాయ పరంగా, వ్యక్తిగతంగా దాడులకు దిగినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు.