Top story: రష్యాలో ఉక్రెయిన్ పాయిజన్ మిషన్, అణు యుద్ధానికి రంగం సిద్ధమైందా?
తనకు ఎదురుతిరిగిన వారిని ఎలిమినేట్ చేయడంలో పుతిన్ వ్యూహాలు ఊహకందని రీతిలో ఉంటాయి. శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా పుతిన్ పథకం వేస్తే తప్పించుకోవడం అసాధ్యం. గూఢచారిగా అది ఆయన హిస్టరీనే చెబుతుంది. చాలా మంది గూఢచారుల్లా తుపాకీకి సైలెన్సర్ బిగించి చంపడం కాదు పుతిన్ స్టైల్..
తనకు ఎదురుతిరిగిన వారిని ఎలిమినేట్ చేయడంలో పుతిన్ వ్యూహాలు ఊహకందని రీతిలో ఉంటాయి. శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా పుతిన్ పథకం వేస్తే తప్పించుకోవడం అసాధ్యం. గూఢచారిగా అది ఆయన హిస్టరీనే చెబుతుంది. చాలా మంది గూఢచారుల్లా తుపాకీకి సైలెన్సర్ బిగించి చంపడం కాదు పుతిన్ స్టైల్.. నోవిచోక్ పాయిజన్‌తో కామ్‌గా ఎనిమీని నరకాని పార్శిల్ చేసేస్తారు. పుతిన్ మాత్రమే కాదు.. రష్యాలో ఎవరు రూలింగ్‌లో ఉన్నా తమ వ్యతిరేకుల ను.. సమస్యాత్మకంగా మారిన వారిని అంతం చేయడానికి నోవిచోక్ పాయిజన్‌ను వాడుతారనేది ఓపెన్ సీక్రెట్. రష్యాలో కాలకూట విషాల అభివృద్ధికి ఏకంగా ప్రత్యేక ల్యాబులే ఉన్నాయి. ఈ ల్యాబుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయో మూడో కంటికి తెలీదు. అలాంటి రష్యాలో అది కూడా ఆయనకి అత్యంత సన్నిహితుడిపై పుతిన్ స్టైల్లోనే పాయిజన్ అటాక్ జరిగితే? మాస్కోలో అదే జరిగింది. అదికూడా సిరియా మాజీ అద్యక్షుడు బషర్ అల్ అసద్‌పై. ఇంతకూ, అసద్‌ను టార్గెట్ చేసింది ఎవరు? రష్యాలో అసలేం జరుగుతోంది?
తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న అసద్ రష్యాకు పారిపోయారు. రష్యా ఎయిర్ ఫోర్స్ స్వయంగా అసద్‌ను డమాస్కస్ దాటించి మాస్కోకు తీసుకెళ్లింది. అక్కడితో ఇక తాను సేఫ్ అనే భావించారు అసద్. కానీ, అసద్‌కు తెలియని విషయమేంటంటే.. మాస్కోలోను అతడికి శత్రువులున్నారు. అవకాశం కోసం వేచి చూస్తున్నారు. చివరికి ఆ ఛాన్స్ రాగానే అతడిపై విష ప్రయోగం చేశారు. డిసెంబర్ 29వ తేదీన అసద్ అనారోగ్యం బారిన పడ్డారు. తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే చికిత్స అందించారు. అసద్‌కు చేసిన వైద్య పరీక్షల్లో విషపదార్థాల ఆనవాళ్లు కనిపిం చాయి. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతోందని రష్యా నిఘా విభాగ మాజీ అధికారి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఐతే, దీనిపై క్రెమ్లిన్ అధికారుల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇలాంటి విషయాలను క్రెమ్లిన్ బయటపెట్టదు. కానీ. అసద్‌పై రష్యాలోనే విష ప్రయోగం చేసేంత ధైర్యం ఎవరికి ఉంది? ఇప్పుడిదే మోస్ట్ హంటింగ్ క్వశ్చన్.
సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిన తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. ఆ దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసద్ రష్యా వెళ్లిన తర్వాత సిరియా తాత్కాలిక సారథి అహ్మద్ అల్-షరాతో ఉక్రెయిన్ విదేశాంగమంత్రి సిబిహ ఆంద్రీ చర్చలు జరిపారు. దీనికిముందు మానవతా సాయంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి సిరియాకు ఆహార పదార్థాలు సరఫరా చేశారు. నిజానికి.. సిరియా అంతర్యుద్ధం పీక్స్‌కు చేరుకున్నప్పుడే ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. తిరుగుబాటుదారులకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సేవలు సాయం అందిస్తున్నాయని ఆరోపించింది. అయితే, రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించ లేదు. ఈ పరిణామాలను డీకోడ్ చేస్తే.. అసద్‌పై విష ప్రయోగం వెనుక ఉక్రెయినే ఉన్నట్టు కని పిస్తోంది.
సిరియా అంతర్యుద్ధంలో రెబల్స్ లక్ష్యం అసద్ సర్కార్‌ను కూలదోయడమే కాదు ఆయన్ను అంతం చేయడం కూడా. అందుకోసం చివరి క్షణం వరకూ ప్రయత్నించారు. అసద్‌ను రష్యా తమదేశానికి సేఫ్‌గా తీసుకెళ్లడంతో రెబల్స్ లక్ష్యం నెరవేరలేదు. రష్యా వెళ్లి అసద్‌ను చంపేంత సీన్ రెబల్స్‌కు లేదు. అందుకే ఉక్రెయిన్‌కు ఆ బాధ్యతను అప్పగించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, అసద్‌ను అంతం చేయడం వల్ల ఉక్రెయిన్‌కు దక్కేదేంటి? అసద్‌ను అంతం చేయడం ద్వారా తాము తలచుకుంటే పుతిన్ గడ్డపైనే ఏదైనా చేయగలం అనే సంకేతాలు పంపొచ్చు. రష్యా అధ్యక్షుడు బలహీనమయ్యారనీ, తన ఆశ్రయం కోరి వచ్చిన వారినీ కాపాడుకోలేకపోతున్నారనీ ప్రపంచానికి చూపించొచ్చు. అన్నింటికీమించి సిరియాలో ఉన్న ఆయుధాలను రష్యాపై సంధించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉక్రెయిన్‌కు చాలా రకాలుగా అసద్ ఎలిమినేషన్ కలిసొస్తుంది. అందుకే, సిరియా తాత్కాలిక ప్రభుత్వంతో ఈ డీల్ చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిజానికి.. ఇప్పటికే ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యాలో ఓ సీక్రెట్ మిషన్ విజయవంతంగా నిర్వహించింది. రష్యా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్‌ను మాస్కోలోనే అంతం చేసింది. కాబట్టి అసద్‌పై విష ప్రయోగం చేయడం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అంత కష్టమేం కాదు. అందుకే, అందరి వేళ్లూ ఉక్రెయిన్ వైపే చూపిస్తున్నాయి. ఒకవేళ అసద్‌పై విష ప్రయోగం వెనుక కీవ్ హస్తం ఉందని తేలితే మాత్రం యుద్ధ భూమిలో పరిణామాలు ఎవరి ఊహకూ అందని రేంజ్‌లో ఉంటాయి. చివరికి అణ్వాయుధాలు సంధించడానికీ పుతిన్ వెనుకాడకపోవచ్చు.