బంగ్లాదేశ్‌లో ఊహించని విధ్వంసం, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తే నాశనమే
పాకిస్తాన్.. ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకూ.. అది చేయని నాన్సెన్స్ అంటూ ఏదీలేదు. ఈ విషయం తెలుసుకాబట్టే చాలా దేశాలు పాకిస్తాన్‌ను విలన్‌గా చూస్తాయి.

పాకిస్తాన్.. ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకూ.. అది చేయని నాన్సెన్స్ అంటూ ఏదీలేదు. ఈ విషయం తెలుసుకాబట్టే చాలా దేశాలు పాకిస్తాన్‌ను విలన్‌గా చూస్తాయి. ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకోడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తాయి. ఇటీవల ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్‌ను పూర్తిగా పక్కనపెట్టేశాయి. కానీ, బంగ్లాదేశ్ మాత్రం గతం మరచిపోయి పాకిస్తాన్ పంచన చేరుతోంది. అందుకు తగిన ఫలితం అనుభవించబోతోంది. ఉగ్రదేశంతో దోస్తీ చేసిన పాపానికి ఢాకా మరోసారి అంతర్యుద్ధంతో అట్టుడికిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మాట స్వయంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమానే చెప్పాడు. ఇంతకూ, బంగ్లాదేశ్‌లో అసలేం జరుగుతోంది? ఆ దేశ ఆర్మీ చీఫ్ పేల్చిన బాంబ్ ఏంటి? ఇస్లామాబాద్‌తో స్నేహం ఢాకాను ఎలా ధ్వంసం చేయబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..
వకర్ ఉజ్ జమాన్.. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్. కానీ, ఈ పోస్టులో ఆయన ఎంతకాలం వరకూ కొనసాగుతాడో చెప్పలేని సిట్యువేషన్ బంగ్లాదేశ్‌లో నెలకొంది. ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహ రణ. దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తనకు క్లియర్ పిక్చర్ కనపడుతోందన్నారు. దేశం సురక్షిత హస్తాలలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని, గడిచిన 7-8 నెలల్లో తాను ఎంతో చూశానని చెప్పారు. ముందుగానే తిరుగుబాటు గురించి హెచ్చరిస్తున్నానని, రేపు ఎందుకు చెప్పలేదని తనను నిందించవద్దని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్ జమాన్ ఆందోళన చెందుతున్నారని, దేశాన్ని విదేశీ శక్తులు నడిపిస్తు న్నాయని ఆయన భావిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో వెంటనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని రాజకీయపెద్దలకు సూచిస్తున్నారని, లేనిపక్షంలో సైన్యం మళ్లీ అధికారాన్ని చేజిక్కించు కుంటుదని ఆయన హెచ్చరిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ, ఇప్పుడే వఖర్ ఉజ్ జమాన్ సైనిక తిరుగుబాటు అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు? బంగ్లాదేశ్‌లో అసలేం జరుగుతోంది?
జనవరి చివరి వారంలో ఒక వార్త ఢాకాను షేక్ చేసేసింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న వకార్ ఉజ్ జమాన్‌ను గద్దె దింపే యత్నాలు జరుగుతున్నాయన్నది ఆ వార్త సారాంశం. పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్.. బంగ్లా ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నాడని కథనంలో పేర్కొన్నారు. ఆ వార్తకు తగ్గట్టే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటుండడం మన దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం.. అక్కడి ఆర్మీ అధికారులతో భేటీ అవుతుండటం వంటి పరిణామాలు ఆ రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలిగేలా చేశాయి. కట్‌చేస్తే.. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎనీ టైం సైనిక తిరుగుబాటు అంటూ బాంబు పేల్చారు.
ఇస్లామిక్ భావాలు కలిగిన.. పాక్ అనుకూలుడిగా పేరు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు వచ్చిన వార్తలకు ఆర్మీ చీఫ్ అనుమానం బలం చేకూరుస్తోంది. ఇప్పటికే సైన్యంలో తిరుగుబాటు కోసం అనుకూల వాతావ రణాన్ని మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ సృష్టించి నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఆర్మీలో మరో పవర్ సెంటర్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ షాహీనుల్ హక్, మేజర్ జనరల్ మోయిన్ ఖాన్ పేర్లుకూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనవరి చివర్లో లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్.. రాజధాని ఢాకాకు వచ్చిన పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్‌తో చర్చలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా ప్రస్తుత ఆర్మీ చీఫ్.. షేక్ హసీనా నియమించిన వ్యక్తి, ఆమెకు దగ్గర బంధువు కూడా. ఇవన్నీ చూస్తుంటే బంగ్లాలో త్వరలోనే ‘మార్షల్ లా’ తప్పదన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాకిస్తాన్ హ్యాండ్ ఉందన్నది ఓపెన్ సీక్రెట్. కానీ, బంగ్లాలో సైనిక పాలన వస్తే ఇస్లామాబాద్‌కు కలిగే లాభం ఏంటి?
బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య ఆల్రెడీ బలమైన సంబంధాలున్నాయి. యూనస్ సర్కార్ ఇస్లామాబాద్ చెప్పిన మాటను కాదనే సీన్ కూడా లేదు. అలా అని ఈ దోస్తీ చివరి వరకూ ఇలాగే కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. ట్రంప్ ఎంట్రీ తర్వాత ఢాకాపై ఒత్తిడి పెరిగింది. బంగ్లాదేశ్‌ను భారత్‌కే వదిలేస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటన యూనస్ సర్కార్‌ను చిక్కుల్లో పడేసింది. కాబట్టి భారత్ వ్యతిరేక కుట్రలకు తమ భూభాగాన్ని వాడుకునేందుకు యూనస్ సర్కార్ అంగీకరించకపోవచ్చు. అదే ఢాకా ఆర్మీ చేతిలో ఉంటే పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కుట్రలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వివరంగా చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా ఢాకాను తనఆధీనంలోకి తెచ్చుకుని భారత్‌లో విధ్వంస కుట్రలు చేయొచ్చు. అసలు సైనిక పాలన అనేదే ఐఎస్ఐ మార్క్ వ్యూహం. ఆ దేశంలో సైన్యం తర్వాతే ప్రజాస్వా మ్యం అయినా మరేదయినా. ఇవన్నీ తెలుసుకాబట్టే పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో బంగ్లా పాలకులతో పాటు మోడీ సర్కార్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే.