సైబరాబాద్ మొక్క మంత్రి ఎలా అయింది? విడదల రజిని లైఫ్ లో మీకు తెలియని మలుపులు
లైఫ్ లో సాదాసీదాగా ఎదగడం ఒక పద్ధతి. ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఎలాగైనా ఎదిగిపోవడం మరో పద్ధతి. ఇది కొందరికి మాత్రమే సాధ్యం.అనుకున్న దాన్ని సాధించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ఏదైనా చేస్తారు.

లైఫ్ లో సాదాసీదాగా ఎదగడం ఒక పద్ధతి. ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఎలాగైనా ఎదిగిపోవడం మరో పద్ధతి. ఇది కొందరికి మాత్రమే సాధ్యం.అనుకున్న దాన్ని సాధించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ఏదైనా చేస్తారు. యుద్ధానికి నీతి లేదనే సూత్రాన్ని బలంగా నమ్ముతారు. ఇందుకు వయసు, అనుభవంతో సంబంధం ఏమీ లేదు. వ్యక్తుల్ని, విధానాల్ని, పార్టీల్ని మార్చుకుంటూ వెళ్తే చాలు.అలాంటి సక్సెస్ ఫుల్ ఉమెన్…. విడదల రజని. లైఫ్ లో రజిని ఎదిగిన తీరు… చూసి కొందరు ఈర్ష పడతారు… కొందరు ఆశ్చర్యపోతారు.
నల్గొండ జిల్లాలో తుర్కపల్లి మండలం, కొండాపూర్ గ్రామంలో రజక కుటుంబంలో పుట్టారు విడదల రజిని. చిన్నప్పటి నుంచి చాలా చురుకు… దూకుడు అని రజనీ గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. సికింద్రాబాద్ లో బిఎస్సి కంప్యూటర్స్ చదివిన తర్వాత… ఆమె ఎంబీఏ చేశారు. హైదరాబాదులో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలోఆపరేటర్ గా చేరారు. అదే కంపెనీలో ప్రమోషన్ కూడా కొట్టారు. ఏకంగా ఆ కంపెనీ యజమాని కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. చిలకలూరిపేటకు చెందిన కుమార స్వామి కాపు కులస్తుడు. రజిని కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిపోయి అక్కడ స్థిరపడింది. భర్తతో కలిసి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు రజిని. తనలో టాలెంట్ ని తాను గుర్తించడమే ఏ మనిషి సక్సెస్ లోనైనా తొలిమెట్టు. చిన్న పూరి గుడిసె లో పుట్టి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ యజమానికి భార్యగా మారిన రజిని తను ఉండాల్సింది ఐటీ కంపెనీలో కాదని డిసైడ్ అయ్యారు. ఎవరినైనా బుట్టలోపడేయ గలిగే మాటకారి తనం, లక్షలు విసిరి తిరిగి కోట్లు సంపాదించాలనే కసి, రాజకీయ అధికారం చేజిక్కించుకోవాలనే తపన ఆమెను ఏపీ రాజకీయాల వైపు నడిపించాయి. అప్పటికే భర్త కుమారస్వామి తనకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక దానిని అమ్మారు.
2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక విడదల రజిని ఇండియా వచ్చి టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. భర్త కుమారస్వామి సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేట వచ్చారు. వి ఆర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి కొన్ని కార్యక్రమాలు చేసి బాగా పబ్లిసిటీ తెచ్చుకున్నారు. తమ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ఇటీవలే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మామని నమ్మ పలికారు. మంత్రి, సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు తో పరిచయం పెంచుకున్నారు. ఆయనకు బాగా దగ్గరయ్యారు. పత్తిపాటి పుల్లారావు స్వయంగా చంద్రబాబుకు రజినినీ పరిచయం చేసి , టిడిపిలో చేర్చారు. రజనీ దగ్గరున్న డబ్బులు చూసి ఆశ పడిన పుల్లారావు ఆమెను చేరదీసి శిష్యురాలిగా తిప్పుకున్నారే తప్ప రాబోయే రోజుల్లో విడదలరజిని తనకే ఎసరు పెడుతుందని ఊహించలేకపోయారు పాపం.2017 విశాఖ మహానాడు వేదికపై విడదల రజిని చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ, మీరు సైబరాబాద్ లో వేసిన మొక్కను సార్… అని ఊగిపోతూ ప్రశంసిస్తుంటే బాబు మురిసిపోయారు
అదే వేదికపై జగన్ ని పిల్లలు ఎత్తుకుపోయే రాక్షసుడిగా, వైయస్ రాజశేఖర్ రెడ్డిని నరకాసురుడిగా అభివర్ణిస్తూ విడదల రజిని పేల్చిన మాటల తూటాలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి.పత్తిపాటి పుల్లారావు వెంట తిరుగుతూనే ఆయన కార్యకర్తలను ఒక్కొక్కరిని తన వైపు లాగేసింది రజిని. ఒకానొక సమయంలో పత్తిపాటి భార్య వెంకాయమ్మ తో నేరుగా మాటలు యుద్ధానికి దిగింది. ఇదంతా పత్తిపాటి గమనించేటప్పటికి పరిస్థితి చేయి దాటిపోయింది.2019 ఎన్నికల్లో చిలకలూరిపేట టిడిపి టికెట్ తనకి ఇవ్వాలంటూ…. చంద్రబాబుకి బిగ్ ఆఫర్ ఇచ్చింది రజిని. అయితే మంత్రివర్గంలో ఉన్న పుల్లారావుని కాదని రజనీకి టికెట్ ఇవ్వలేననీ చంద్రబాబు తెగేసి చెప్పేశారు. వెంటనే ప్లేటు తిప్పేసారు ఆమె. పాదయాత్ర చేస్తున్న జగన్ దగ్గరికి వెళ్లి వైసీపీలో చేరారు రజిని. బొత్స సత్యనారాయణ ద్వారా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా దగ్గర అయ్యారు ఆమె. 2019లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీసీ మహిళ, భర్త కాపు, వైయస్ జగన్ హవా ఈ మూడు కలిసి వచ్చి చిలకలూరిపేటలో తన రాజకీయ గురువు పత్తిపాటి పుల్లారావు పైనే ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
సైబరాబాద్ లో చంద్రబాబు వేసిన మొక్క జగన్ పెరట్లో పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆర్థిక బలం, సజ్జల రామకృష్ణారెడ్డి మద్దతు రెండు కలిసి వచ్చి 2022 జగన్ మంత్రివర్గ విస్తరణలో బీసీ మహిళ కోటాలో ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయింది రజిని. ఒక మహిళ… తొలిసారి ఎమ్మెల్యే ఏకంగా మంత్రి అయి పోవడం అటు పార్టీలోనూ… ఇటు పాలిటిక్స్ లోను అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన తృప్తి పడలేదు రజిని. చకచకా పావులు కదుపుకుంటూ ముందుకెళ్ళిపోయింది. అవసరం ఉన్న వాళ్ళతో మాత్రమే అంట కాగడం, అవసరం తీరిపోతే తీసి పక్కన పెట్టడం అనే ఫార్ములాను ప్రతి కార్నర్ లోను ప్రయోగించరామే. విడుదల రజిని చుట్టూ ఎప్పుడూ ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆమె మరిది, పిఏ, అనుచరులు ఇలా ఎక్కడికి వెళ్లినా 10 …..12 మంది గ్యాంగ్ తప్పనిసరి. ప్రతి మీడియా ఆర్గనైజేషన్లో ఆమెకు ఒక సొంత మనిషి ఉంటాడు.
తెలుగు రాష్ట్రాల్లో సొంత సోషల్ మీడియా వ్యవస్థ పెట్టుకున్న మొదటి ఎమ్మెల్యే కూడా రజనీయే. రజనీపై ఎక్కడ నెగిటివ్ గా వచ్చిన వెంటనే ఈ సోషల్ మీడియా టీం అవతల వాళ్ళని బ్రష్టు పట్టిస్తుంది. అల్లరి చేస్తుంది. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో, ఎం ఎల్ సి మర్రి రాజశేఖర్ తో నేరుగా తలపడ్డారామే. వాళ్లని తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఎక్కువ మాట్లాడితే బీసీ మహిళపై దాడి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైసీపీలో మిగిలిన నాయకులు అందరి పైన అరాచకం చేసేవాళ్ళు రజిని మనుషులు. ఇవన్నీ తెలిసినా కూడా సజ్జల రజినినీ వెనకేసుకుంటూ వచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినా రెండున్నర సంవత్సరాల్లోనే మంత్రి అయిపోవడం ద్వారా జగన్ దగ్గర తన బలం ఏంటో చూపించారు రజిని. నియోజకవర్గంలో రజిని.. ఆమె అనుచరులు విచ్చలవిడిగా దందాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
కంకర, మట్టి కాంట్రాక్టర్లు దగ్గర వసూలు చేశారు. ఎవడు నోరెత్తిన కేసులు పెట్టిచ్చేవాళ్ళు. జగనన్న ఇల్లు కట్టించడానికి, పేదలకు పంచడానికి కొన్న భూముల్లో విడదల గ్యాంగ్ కోట్లు కొట్టేసారని…. భూములు అధిక రేట్లు కు అమ్మించి బాగా నొక్కేసారని అప్పట్లో పార్టీలోనే బాగా టాక్ నడిచింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నాయకుడి దగ్గర ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకపోవడంతో ఆ పంచాయతీ సజ్జల… జగన్ వరకు వెళ్ళింది. ప్రతి సమస్యలోనూ… వివాదంలోనూ సజ్జల ,విడదల రజిని కాపాడుకుంటూనే వచ్చారు. అవినీతి ,అక్రమాలు పెచ్చరిల్లిపోవడంతో చిలకలూరిపేటలో రజిని గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. సర్వేల పేరుతో 2024 ఎన్నికల్లో ఎందరికో టికెట్లు నిరాకరించిన జగన్ రజనీకి మాత్రం నో చెప్పలేకపోయారు.
గుంటూరు వెస్ట్ కి తీసుకొచ్చి ఆమెనీ నిలబెట్టారు. హఠాత్తుగా పార్టీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యే ఆయన రజిని వైసీపీలో ఎంత పవర్ ఫుల్ అనేది అప్పుడు జనానికి తెలిసింది. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి గుంటూరులో చెల్లుతుందా? అక్కడ అత్యంత వీక్ కాండిడేట్ పై కూడా రజిని దారుణంగా ఓడిపోయింది. రజని దెబ్బకి కృష్ణదేవరాయులు టిడిపిలో చేరి అక్కడి నుంచి నరసరావుపేటకు ఎంపీ అయ్యారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి దండం పెట్టి వెళ్లిపోయారు. ఆరేళ్ల రాజకీయ జీవితంలోనే ఎందరినో తొక్కి పడేసిన రజిని ఇప్పుడు పార్టీలోనూ, చిలకలూరిపేట లోను తనకు ఎదురు లేదు అంటున్నారు. చంద్రబాబు సార్ సైరాబాదులో మీరేసిన మొక్కని అని చెప్పుకున్న రజిని…. జగనన్న మరో జన్మ ఇచ్చావు అంటూ అదే ఫ్రీక్వెన్సీ తో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.
స్టోన్ క్రషర్ యజమానినీ బెదిరించి రెండు కోట్లు కొట్టేసిన కేసులో విడదల రజనీపై ఇప్పుడు కేసు నమోదు అయింది. కానీ ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.ఒకపక్క కోటీశ్వరురాలిని అంటుంది…. మరోపక్క బీసీ మహిళను అంటుంది. ఇంకోపక్క మా మామగారు కాపులంటుంది. మొన్న ఈమధ్య రజిని టిడిపిలోకి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. బిజెపి లోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించి విఫలమైందామే. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఏ రోటి కాడ ఆ పాట పాడడం… ఎదగడానికి ఎవ్వడినైనా తొక్కడం… ఈ రెండు ఫార్ములాలని నమ్ముకుని రజిని రాజకీయాల్లో వెలిగిపోతున్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈసారి హోం మంత్రి అవ్వాలనేది విడుదల రజిని టార్గెట్.