జమిలీ ఎన్నికల ప్రాసెస్ ఇదే, మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

అందరూ ఊహించినట్టుగానే "వన్ నేషన్ - వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)" బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 06:43 PMLast Updated on: Dec 12, 2024 | 6:43 PM

Union Cabinet Approves One Nation One Election Bill

అందరూ ఊహించినట్టుగానే “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)” బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 18,000 పేజీల కోవింద్ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించిన కేంద్రం… దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్నదే జమిలి బిల్లు లక్ష్యంగా తెలుస్తోంది.

పార్లమెంట్, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపులు జరిపింది రామ్‌నాథ్ కోవింద్ కమిటీ… జమిలి ఎన్నికలను 30కు పైగా పార్టీలు సమర్థించగా, కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకించింది. 1951 నుంచి 1967 వరకు దేశంలో జరిగిన జమిలి ఎన్నికలు జరిగాయి.

గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా సిఫార్సులు చేసారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో మొత్తం 18 సవరణలు అవసరం కానున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్టికల్ 83 (పార్లమెంట్ వ్యవధి గురించి చెప్పే ఆర్టికల్), ఆర్టికల్ 172 (రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధి)ను సవరించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలంటే ఆర్టికల్ 324(ఏ), ఆర్టికల్ 325ను సవరించాల్సిన అవసరం ఉంది. 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. జమిలి ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు ఒకే ఓటర్ల జాబితా ఉంటుంది.