అల్లు అర్జున్ గురించి రేవంత్ అతి: బండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ అంబేద్కర్ కి చేసిన పాపం పోవాలంటే రేవంత్ కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకోవాలన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ అంబేద్కర్ కి చేసిన పాపం పోవాలంటే రేవంత్ కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పంచతీర్థాలు దర్శించుకోవాలని… రాహుల్ గాంధీకి పంచతీర్తాలు అంటే అర్థం తెలుసా..? అని నిలదీశారు. అప్పుడు కానీ కాంగ్రెస్ చేసిన పాపం పోదన్నారు. అంబేద్కర్ విగ్రహం కేసిఆర్ పెట్టారని అంటున్నారు? అవి ప్రజల డబ్బులు కదా? అని నిలదీశారు.
అల్లు అర్జున్ ఇష్యూ అసెంబ్లీ లో చర్చించాల్సిన అవసరం లేదన్నారు బండి. అల్లు అర్జున్ ఎపిసోడ్ లో సీఎం మనుసులో ఉన్న మాట బయట పెట్టాలన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఇండస్ట్రీ ఏపీకి వెళ్తే తెలంగాణ కు నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ నష్టం చేకూర్చే విధంగా మాట్లాడకుండా వారి అధిష్టానం కాంగ్రెస్ నాయకులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అయితే సంతోషమే కదా అన్నారు బండి.