రేవంత్ పై కేంద్ర మంత్రి ప్రసంశల వర్షం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇవాళ దేశ రక్షణ లో కీలకమైన రోజుగా అభివర్ణించారు. అబ్దుల్ కలాం జయంతి రోజు VLF స్టేషన్ శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డిపై ప్రసంశల వర్షం కురిపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2024 | 02:57 PMLast Updated on: Oct 15, 2024 | 2:57 PM

Union Minister Showered Praises On Revanth

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇవాళ దేశ రక్షణ లో కీలకమైన రోజుగా అభివర్ణించారు. అబ్దుల్ కలాం జయంతి రోజు VLF స్టేషన్ శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డిపై ప్రసంశల వర్షం కురిపించారు. ఈ స్టేషన్ ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ సహకారం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ అభినందనీయమన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలకమని రక్షణ శాఖ పరికరాలు తయారీలో హైదరాబాద్ కు మంచిపేరుందని తెలిపారు.

పార్టీలు వేరైనా దేశ రక్షణ లో అందరూ కలిసి నడవాలని కోరారు. దేశ రక్షణలో ఈ VLF స్టేషన్ ఎంతో ముఖ్యమైందన్నారు. కమ్యునికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఫ్రీక్వెన్సీ వరకు వచ్చామని ఈ టెక్నాలజీ యుగంలో కమ్యునికేషన్ చాలా ముఖ్యమని తెలిపారు. సముద్రంలో శత్రు దేశాలపై పైచేయి సాధించాలంటే రాడార్ స్టేషన్ ఏర్పాటు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ యుగంలో అడుగుపెట్టాం.. క్షణాలలో సమాచారం చేరుతోందన్నారు రాజనాథ్. సమాచార విప్లవం అనేక దేశాలను కలుపుతోందన్నారు.