30వేల మంది ఆ నరకానికే…! మళ్లీ కనిపించరు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అసలు తగ్గట్లేదు... ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుంది ఆయన తీరు... ఇమ్మిగ్రేషన్ విషయంలో తాను అనుకున్నదే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30వేల మంది అక్రమ వలసదారులను గ్వాంటెనామా బేకు తరలించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అసలు తగ్గట్లేదు… ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుంది ఆయన తీరు… ఇమ్మిగ్రేషన్ విషయంలో తాను అనుకున్నదే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30వేల మంది అక్రమ వలసదారులను గ్వాంటెనామా బేకు తరలించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో మన భారతీయులు కూడా ఉండి ఉండొచ్చు.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి ఇమ్మిగ్రేషన్ తప్ప మరో సమస్యే దేశంలో లేదన్నట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ అక్రమ వలసదారులపైనే ఫోకస్ పెట్టారు. ఈ పదిరోజుల్లో ఇప్పటివరకు 8వేల మందిని స్వదేశాలకు పంపించి వేసింది హోమ్‌లాండ్ సెక్యూరిటీ. చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో వారిని కుక్కి జంతువులను ఎక్స్పోర్ట్ చేసినట్లు ఆయా దేశాలకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పంపించివేస్తోంది. ఒప్పుకోకపోతే పన్నువేస్తానని బెదిరించి మరీ దారికి తీసుకొస్తోంది. అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ… ముఖ్యంగా నేరాలకు పాల్పడేవారినే టార్గెట్ చేస్తోంది. రోడ్లపై కుక్కలను వలలు వేసి పట్టుకున్నట్లుగా చాలా దురుసుగా అక్రమ వలసదారుల్ని బందిస్తున్నారు. దీంతో చాలామంది ఇప్పటికే అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోగా…. మరికొందరు స్వయంగా తమ దేశాలకు పారిపోతున్నారు. లేటెస్ట్గా న్యూయార్క్‌లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వేటలో పడ్డారు హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు. స్వయంగా ట్రంప్ కేబినెట్లోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని తమ టార్గెట్ ఏంటన్న మెసేజ్ పంపారు. హోమ్‌లాండ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం ద్వారా రిమోట్ ఏరియాల్లోనూ ఏరివేతలు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు ట్రంప్.
లేటెస్ట్గా ట్రంప్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. నేరాలకు పాల్పడే అక్రమ వలసదారుల్ని గ్వాంటెనామాబే జైలుకు తరలించాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై సంతకాలు కూడా చేశారు. ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. 30వేల మంది అక్రమ వలసదారుల్ని ఆ నరకానికి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ లేకన్ రైలీ పేరుతో తీసుకొచ్చిన యాక్ట్‌పై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం నేరం ప్రూవ్ కావాల్సిన పనిలేదు. దొంగతనం, హత్య, కిడ్నాప్, డ్రగ్స్ స్మగ్లింగ్, పోలీసులపై దాడి వంటివి చేసిన అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసి జైలుకు లేదా వారి దేశాలకు తరలిస్తారు. నేరం రుజువవ్వాల్సిన పనిలేదు. అనుమానం వస్తే చాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా సంతకం చేసిన మొదటి చట్టం ఇదే. జార్జియాలో వెనుజులాకు చెందిన అక్రమ వలసదారుడి చేతుల్లో చనిపోయిన లేకన్ రైలీ అనే నర్సింగ్ విద్యార్థి పేరిట ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై సంతకం చేసినప్పుడే గ్వాంటెనామా బేకు నేరచరిత్ర ఉన్న అక్రమ వలసదారుల్ని తరలిస్తామని చెప్పారు ట్రంప్. కొన్ని దేశాలకు ఈ నేరస్తులను పంపినా వారు మళ్లీ తిరిగివస్తారన్న అనుమానం అమెరికాలో ఉంది. అందుకే అలాంటి వారందరినీ ఈ జైలుకు పంపేస్తారు. 30వేల సామర్ధ్యంతో ఇక్కడ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ నరకానికి తోలేయడమే.
గ్వాంటెనామా బేకు మరో పేరు నరకం… అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఇక్కడకు తరలించి చిత్రహింసలు పెడతారు. క్యూబాలో ఉన్న ఈ జైల్లో చట్టాలుండవు… హక్కులుండవు… కొడితే కొట్టించుకోవాలి… చంపితే చావాలి… సెప్టెంబర్ 9 దాడుల తర్వాత చాలామంది ఉగ్రవాదులను ఇక్కడ ఉంచారు. వారిలో చాలామంది ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఈ జైల్లో ఉండేవి చిన్న చిన్న గదులు… సూర్యకాంతి పడదు… శబ్దం వినిపించదు… ఏది పగలో ఏది రాత్రో తెలియదు…. దీంతో మానసికంగా కుంగిపోతారు. పిచ్చోళ్లైపోతారు. వారిలో చాలామంది మళ్లీ ప్రపంచాన్ని చూడరు. చాలామంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. దీన్ని మూసేయాలని చాలా డిమాండ్లు వచ్చినా అమెరికా పట్టించుకోలేదు. అలాంటి నరకం లాంటి జైలుకు వలస ఖైదీలను తరలించాలన్నది ట్రంప్ ప్లాన్. ఇక్కడ్నుంచి పారిపోయే అవకాశాల్లేవు. 1903లో క్యూబా నుంచి ఈ ప్రాంతాన్ని అమెరికా లీజుకు తీసుకుంది. ఇక్కడ యూఎస్ నావల్ బేస్ నిర్వహించేవారు. 2002జనవరిలో దీన్ని జైలుగా మార్చారు. ఉగ్రవాదులను ఇక్కడ బందించారు. బరాక్ ఒబామా, జో బైడెన్ ఈ జైలును మూసివేయాలని ప్రయత్నించినా అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. 2002వరకు ఇక్కడ 8వందల మంది ఖైదీలుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 15కు పడిపోయింది. అందులో ముగ్గురిని వారి దేశాలకు పంపాల్సి ఉంది. ఇక్కడ బంధించిన వారిలో నేరాలు రుజువయ్యేది కేవలం 55శాతం మందిపైనే అని రిపోర్ట్ చెబోతోంది. అంటే మిగిలిన వారు తప్పు చేయకపోయినా రోజూ చావును అనుభవించాలన్నమాట.
అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ అమెరికా చాలామందిని వారి దేశాలకు డిపోర్ట్ చేసింది. బైడెన్ హయాంలోనూ లక్షలమందిని వెనక్కు పంపేసింది. దొరికిన వారిని దొరికినట్లు వెనక్కు పంపింది. కానీ ట్రంప్ మాత్రం అలాకాదు. వెంటాడుతున్నారు. వేటాడుతున్నారు. భారతీయ అమెరికన్లు కూడా ట్రంప్ తీరు చూసి వణికిపోతున్నారు. చదువుకోవడానికి వెళ్లి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఖర్చులు సంపాదించుకుంటున్న వారంతా ఇప్పుడు సైలెంటైపోయారు. ఎక్కడ ఎవరికి దొరికిపోతామో అన్న భయంతో తమ అపార్ట్మెంట్లకే పరిమితం అవుతున్నారు. వ్యాలీడ్ వీసా ఉన్న వారు కూడా ఎందుకొచ్చిన తంటా అనుకుని తమపని తాము చేసుకుని పోతున్నారు. నీ వీకెండ్స్.. నో పార్టీస్..
లేటెస్ట్గా అమెరికన్ కాంగ్రెస్ హౌస్ కమిటీ విద్యార్థి వీసాల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యింది. కొన్ని రకాల వీసాలపై వస్తున్న వారు తిరిగి వెళ్లడం లేదని గుర్తించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా F-1, M-1 వీసాలు పొందిన వారితో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 2023లో వీసాలు ముగిసినా 7వేల మంది భారతీయ విద్యార్థులు తిరిగి వెళ్లలేదని వారి విచారణలో తేలినట్లు చెబుతున్నారు. అందుకే ఈ వీసా స్ట్రక్చర్‌ను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదువు పూర్తైన తర్వాత ప్రస్తుతం విద్యార్థులు రెండేళ్లు అక్కడ ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇకపై అది ఉండకపోవచ్చు. డిగ్రీ తీసుకున్న వెంటనే స్వదేశానికి ఫ్లైటెక్కాయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం లక్షల్లో ఇస్తున్న H1B వీసాలను ఇకపై ఏడాదికి 75వేలకే పరిమితం చేసేలా కూడా చట్టాన్ని మార్చబోతున్నారు. త్వరలోనే ఈ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తోంది ట్రంప్ యంత్రాంగం. మొత్తంగా చూస్తే మన భారతీయ విద్యార్థులకు వరుసగా బ్యాడ్‌న్యూస్ వినిపిస్తున్నారు ట్రంప్.