Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటతో ఆ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఆప్షన్‌లా కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారే చాన్స్..!
తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతేలా ఆ పార్టీ పావులు కాదుపుతోంది. మొట్టమొదటి సారి తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్ని నిర్వహించబోతోంది. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సి వ్యూహాల గురించి ఈ మీటింగ్‌లో కీలకంగా చర్చించబోతున్నారు. అటు తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు టీపీసీసీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు.
హైదరాబాద్ వేదికగా CWC సమావేశాలు..
సాధారణంగా CWC సమావేశాలు ఢిల్లీలో నిర్వహిస్తారు. వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా ఢిల్లీ వెళ్లి సమావేశంలో పాల్గొంటారు. కానీ ప్రస్తుతం ఢిల్లీకి బయట అదికూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లోనే తెలంగాణలో మీటింగ్ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో తెలియజేస్తోంది. కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. ఆర్థిక, రాజకీయ అంశాల్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉండే నాయకులు చాలా మంది కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చాలా మంది చేరేందుకు రెడీగా ఉన్నట్లు టాక్.
బీఆర్ఎస్ అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ ఏ దిక్కా..?
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటతో ఆ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఆప్షన్‌లా కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారే చాన్స్ ఉంది. దానికి తోడు బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో బీసీ నేతలు, మహిళలను తక్కువ టికెట్లు కేటాయించారనే అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి మరో ఆయుధంగా మారబోతోంది. ఆ తప్పులు కాంగ్రెస్‌లో జరగకుండా సమన్యాయం చేస్తే ఎన్నికల్లో అది కలసి వచ్చే అంశంగా మారబోతోంది. ఇదే విషయంపై మీటింగ్‌లో కీలక చర్చ జరగబోతున్నట్టు టాక్.
తెలంగాణ కాంగ్రెస్‌లో.. సమన్వయ లోపం..
ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అతిపెద్ద సమస్య సీనియర్ జూనియర్ గొడవ. చాలా మంది నేతల మధ్య సమన్వయ లోపం. ఈ మీటింగ్ ఆ సమస్యకు చెక్ పెట్టే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతందట. కర్నాటక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేతలంగా ఒక్క తాటిపైకి వచ్చి పోటీలో నిలవడం ఆ పార్టీకి ప్లస్‌గా మారింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట కాంగ్రెస్ నేతలు. దీంతో పాటు ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకతను కాంగ్రెస్ ఓట్‌బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ రెండు విషయాలు సరిగ్గా నిర్వహిస్తూ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేడం గ్యారంటీ అనే ధీమాలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. మరి టీపీసీసీ నేతలు కూడా అదే దారిలో వెళ్లి అధికారం దిశగా నడుస్తారా లేక గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తారా అనేది మీటింగ్ తరువాత చూడాలి.