V Hanumantha Rao: హాస్పిటల్‌లో వీహెచ్.. అయ్యయ్యో వీహెచ్ తాతకు ఏమైంది..?
కాంగ్రెస్ పార్టీ మొత్తంలో అందరూ కౌంటర్ ఇచ్చే తీరు ఒకలా ఉంటే.. వీహెచ్ స్టైల్ మాత్రం వేరేలా ఉంటుంది. ఈ కారణంగానే ఆయను చాలా మంది అభిమానిస్తుంటారు. అలాంటి వీహెచ్ ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు.
V Hanumantha Rao: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాయకుల్లో వి హనుంతరావు ప్రముఖుడు. రాష్ట్ర ప్రజలకు వీహెచ్‌గా పరిచయం ఉన్న హనుమంతరావు మాటలకు ఫ్యాన్ అవ్వనివాళ్లు దాదాపుగా ఉండరు. ఏడు పదలు వయసున్నా.. యంగ్ లీడర్స్‌తో పోటీ పడి పార్టీ కార్యక్రమాలు, ప్రెస్‌మీట్లు పెడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ మొత్తంలో అందరూ కౌంటర్ ఇచ్చే తీరు ఒకలా ఉంటే.. వీహెచ్ స్టైల్ మాత్రం వేరేలా ఉంటుంది. ఈ కారణంగానే ఆయను చాలా మంది అభిమానిస్తుంటారు. అలాంటి వీహెచ్ ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు.
BRS-KCR: బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్
కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో వీహెచ్‌ను హైదరాబాద్ శివం రోడ్డులోని ఓ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం అక్కడే ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. వయసు రిత్యా ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ చెప్తున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా వీహెచ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డట్టు డాక్టర్లు చెప్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వీహెచ్‌కు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో రాజ్యసభ ఇస్తారని అంతా అనుకున్నారు. రీసెంట్‌గా రాజ్యసభ టికెట్ల పంపిణీ జరిగినా.. వీహెచ్‌కు మాత్రం ఆ అవకాశం కల్పించలేదు.
వయసు రీత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్ అనుకున్నారో ఏమో.. డాక్టర్లు కూడా ఇప్పుడు వీహెచ్‌కు అదే సూచన చేస్తున్నారు. ఎక్కువగా పబ్లిక్‌లోకి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. మరి సరదా సరదాకే రాస్తారోకోలు చేసే వీహెచ్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అయినా రెస్ట్ తీసుకుంటారా.. మళ్లీ రోడ్డెక్కుతారా చూడాలి.