VAKITI SUNITHA REDDY: ప‌డి లేచినకెరటం.. నాలుగోసారి ద‌క్కిన విజ‌యం

వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ త‌ర్వాత వరుసగా మూడు సార్లు ఓటమి తర్వాత.. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వాకిటి సునీతారెడ్డి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి.. తర్వాత వరుసగా మూడు సార్లు ఓటమి పాలయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 06:00 PMLast Updated on: Dec 06, 2023 | 6:00 PM

Vakiti Sunitha Of Brs Wins From Narsapur Assembly

VAKITI SUNITHA REDDY: కెరటం నాకు ఆద‌ర్శం.. ప‌డి లేచినందుకు కాదు.. ప‌డుతున్నా లేస్తున్నందుకు.. అంటూ ఓ మోటివేష‌న్ కొటేష‌న్ గురించి అంద‌రూ దాదాపుగా వినే ఉంటారు. ఆ మాట స‌రిగ్గా వాకిటి సునీతా రెడ్డికి అతికిన‌ట్లుగా స‌రిపోతుంది. వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ త‌ర్వాత వరుసగా మూడు సార్లు ఓటమి తర్వాత.. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వాకిటి సునీతారెడ్డి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి.. తర్వాత వరుసగా మూడు సార్లు ఓటమి పాలయ్యారు. రెండు సార్లు అసెంబ్లీ, ఒకసారి పార్లమెంట్​ ఎన్నికల్లో పరాజయం చూశారు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సునీత.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల తేడాతో గెలిచారు. 1999 సాధారణ ఎన్నికల సమయంలో నర్సాపూర్‌‌ సెగ్మెంట్‌ ‌కాంగ్రెస్‌‌ టికెట్‌‌ ఆశించిన శివ్వంపేట మండల జడ్పీటీసీ లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్​ నర్సాపూర్‌ ‌టికెట్‌‌ను లక్ష్మారెడ్డి భార్య సునీతారెడ్డికి కేటాయించింది. అప్పటి వరకు గృహిణిగా ఉన్న సునీతారెడ్డి అనూహ్యంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1999 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అమె తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో సైతం సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు మరోమారు కాంగ్రెస్‌‌ టికెట్‌‌ లభించగా ఆ ఎన్నికల్లోనూ గెలుపొంది వై.ఎస్‌‌.రాజశేఖర్‌‌రెడ్డి క్యాబినెట్‌‌లో మీడియం ఇరిగేషన్​ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సునీతారెడ్డి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్‌‌ కొట్టారు. అపుడు కూడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో సునీతారెడ్డికి మంత్రి పదవి దక్కింది.

అలా.. ఆమె, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీచేసిన సునీతారెడ్డి.. టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి చిలుముల మదన్‌‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.. 2014లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో మూడు సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో తనకు తిరుగులేదని చాటిన సునీతారెడ్డి.. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్ ​ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో 2019 పార్లమెంట్​ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పి బీఆర్​ఎస్​లో చేరారు. 2021లో ఆమెకు రాష్ట్ర మహిళా కమిషన్​చైర్​ పర్సన్​ పదవి దక్కింది.. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్​ఎస్ ​అభ్యర్థిగా నర్సాపూర్​ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సునీతారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదివరకు వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ​అభ్యర్థి ఆవులు రాజిరెడ్డిపై గెలుపొంది త‌న స‌త్తా నిరూపించారు.