టాలీవుడ్ నిర్మాతతో వంశీ రియల్ వ్యాపారాలు..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ.. 2019 తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక అక్కడి నుంచి వంశి దూకుడు పెంచారు. అప్పట్లో ప్రతిపక్షాలపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. ముఖ్యంగా నారా భువనేశ్వరి విషయంలో వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలపై ఇప్పటికి సోషల్ మీడియాలో కార్యకర్తలు ఫైర్ అవుతూనే ఉంటారు.
అందుకే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సరే వైసీపీ నుంచి కూడా పెద్దగా స్పందన ఉండటం లేదట. అటు నియోజకవర్గంలో కూడా వంశీ విషయంలో పెద్దగా స్పందన కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే వంశీ కబ్జాలు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. తెలంగాణలో కూడా వంశీ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. బీఆర్ఎస్ పెద్దలు అలాగే ఓ ప్రముఖ కాంట్రాక్టర్ తో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఒక ప్రముఖ సినీ నిర్మాతతో కలిసి కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు.
అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో కూడా వంశీ కాంట్రాక్టులు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొడాలి నానితో కలిసి కాలేశ్వరం ప్రాజెక్టులో వల్లభనేని వంశీ కొన్ని వర్కులు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ పరిచయాలతోనే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా ఒక ప్రముఖ నిర్మాతతో కలిసి వల్లభనేని వంశీ నడిపించారు. హైదరాబాద్ – గన్నవరం అప్పట్లో వల్లభనేని వంశీ గట్టిగా తిరిగేవారు. ఇక అదే నిర్మాతతో కలిసి విజయవాడలో కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు గుర్తించారు.
అయితే దీనిలో అక్రమాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. గన్నవరం నియోజకవర్గంలో కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వంశీ నడిపించారు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన విజయవాడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇందులో ప్రముఖ నిర్మాత పాత్ర కూడా ఉందని సమాచారం. ఇక హైదరాబాదులో కూడా వంశీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనితో తెలంగాణలో కూడా వంశీ ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న.
దీనితో అటు తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని ఏపీ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడలో 2019 నుంచి 2024 వరకు కొంతమంది వంశీ సన్నిహితులు రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టారు. దీనిపై కూడా పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ శివారులోని కొన్ని గ్రామాల్లో వంశీ పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసి భూములను విక్రయించినట్లు ప్రచారం జరిగింది. అదే ఫార్ములాను విజయవాడలో కూడా వంశీ అమలు చేశారని, సన్నిహితుల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేసి కృష్ణాజిల్లాలో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాన్ని నడిపించినట్లు టాక్.