Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..
వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని టాక్. రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులే కాదు.. వంగవీటి ఫ్యామిలీ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలియడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

Vangaveeti Radha Krishna: వంగవీటి కుటుంబానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఏపీ పాలిటిక్స్‌ను.. ముఖ్యంగా విజయవాడ రాజకీయాలను శాసించిన కుటుంబం అది. వంగవీటి రంగా మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధాకు పాలిటిక్స్ పెద్దగా కలిసి రాలేదు. ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతీసారి పరాభవమే ఎదురైంది. పార్టీలు మారినా.. అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా అడుగులు ఎటు పడుతున్నాయో తెలీదు.
సైకిల్ దిగబోతున్నారా అనే చర్చతో రాజకీయం వేడెక్కిన వేళ.. వంగవీటి కుటుంబం నుంచి ఓ కూల్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వంగవీటి వారి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని టాక్. రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులే కాదు.. వంగవీటి ఫ్యామిలీ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలియడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం పుష్పవల్లి అనే యువతితో రాధాకృష్ణకు వివాహం ఖాయం అయినట్లు తెలుస్తోంది. మిత్రుడికి దగ్గరి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారని.. ఈ మేరకు నిశ్చయం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జీ చిన్న కుమార్తెనే పుష్పవల్లి. ఆమెతోనే వంగవీటి రాధాకు పెళ్లి జరగబోతోంది. ఈనెల 19న నర్సాపురంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. సెప్టెంబర్ 6న లేదా అక్టోబర్‌లో పెళ్లి ముహూర్తం ఉండే అవకాశం ఉంది. వివాహం విజయవాడలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే వివాహానికి సంబంధించిన వార్తలపై వంగవీటి రాధా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.