Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం.. ఆఫర్ ఏంటంటే..
మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంగవీటి రాధాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని.. రాధాను కోరినట్లు సమాచారం.

Vangaveeti Radha Krishna: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటచేసుకుంది. టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు చేయడంతో.. కాపుల ఓట్లు టార్గెట్‌గా ప్రయత్నాలు ప్రారంభించిన వైసీపీ.. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
CHANDRABABU NAIDU: కుప్పంపై వైసీపీ కన్ను.. పెద్దిరెడ్డి రెడీ చేసిన స్కెచ్ ఇదేనా..?
మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంగవీటి రాధాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని.. రాధాను కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్, ఈస్ట్ టికెట్లను రాధా ఆశించారు. ఐతే ఆ రెండు స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో రాధా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ.. మాజీ మంత్రులు ఇద్దరు వెళ్లి ఆయనను కలవడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. వంగవీటి రాధా, కొడాలి నాని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ! రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ ఇద్దరు మంచి స్నేహితులు. అలాంటిది కొడాలి నాని వెళ్లి.. రాధాను వైసీపీలోకి ఆహ్వానించడంతో.. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే కొడాలి నాని, రాధ.. ఎప్పుడు కలిసినా.. పార్టీ మార్పు ప్రచారమే జరుగుతోంది.
ఆ మధ్య వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేశారు. ఈ సమయంలో రాధతో కొడాలి నాని ఉన్నారు. ఆ సమయంలోనూ రాధా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని.. స్నేహంలో భాగంగానే కాశీ వెళ్లానని కొడాలి నాని చెప్పడంతో.. ఆ సమయంలో ప్రచారం కూల్ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టికెట్ల రచ్చ పీక్స్‌కు చేరుతున్న సమయంలో.. రాధాను కొడాలి నాని డైరెక్ట్‌గా పార్టీలోకి ఆహ్వానించడంతో.. ఏం జరగబోతోంది.. విజయవాడ పాలిటిక్స్‌లో సంచలనాలు చూడబోతున్నామా అనే డిస్కషన్ నడుస్తోంది.