Vangaveeti Radha: లోకేశ్‌తో వంగవీటి రాధా భేటీ.. జంపింగ్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందా ?
లోకేశ్ పాదయాత్రలో యాక్టివ్‌గా కనిపించారు వంగవీటి రాధా. పసుపు పార్టీతోనే ప్రయాణం అన్నట్లు లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. దీంతో రాధా పార్టీ మారుతారంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లు అయింది.

కాపుల చుట్టూనే తిరుగుతోంది ఏపీలో రాజకీయం! ఇలాంటి సమయంలో కాపులకు బ్రాండ్ అంబాసిడర్‌లాంటి ఫ్యామిలీకి చెందిన నాయకుడు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం.. రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రాధా (Vangaveeti Radha) విషయంలో అదే కనిపించింది ఇప్పుడు !
టీడీపీని (TDP) వీడి ఆయన జనసేనలోకి (Janasena) వెళ్తున్నారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. త్వరలోనే గ్లాస్ చేతిలో పట్టుకుంటారని.. బందరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరు మీద సాగింది. కొడాలి నాని, (Kodali Nani) వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) చాలా క్లోజ్ కావడం.. ఆ మధ్య జనసేన ప్రధాన నాయకుడు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వెళ్లి కలవడంతో.. రాధా సైకిల్‌కు హ్యాండ్ ఇవ్వడం ఖాయం అనే ప్రచారం సాగింది. ఐతే ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెట్టేలా.. లోకేశ్ (Nara Lokesh) పాదయాత్రలో యాక్టివ్‌గా కనిపించారు వంగవీటి రాధా. పసుపు పార్టీతోనే ప్రయాణం అన్నట్లు లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. దీంతో రాధా పార్టీ మారుతారంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లు అయింది.
లోకేశ్‌తో భేటీ ద్వారా.. వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారనే సంకేతాలను పంపినట్టుగా అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయ్. అలాగే రాధా పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాపుల (Kapu) ఓట్లు కీలకంగా భావిస్తున్న టీడీపీ(TDP).. ఆ ఓటు బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావొద్దనే పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే రాధాను ముందు పెట్టి కాపుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు లోకేశ్‌తో రాధా భేటీలో.. తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.