రేవంత్ ను రెచ్చగొడుతున్న వర్మ… అల్లు అర్జున్ అరెస్ట్ పై సినిమా
ఎన్నో సంచలన విషయాలు పై సినిమాలు తీయడం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గాని నిలవడం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్టైల్. అందుకే ఎన్నో కాంట్రవర్సీలను ఆయన సినిమాలుగా ఎంచుకుంటూ ఉంటారు.
ఎన్నో సంచలన విషయాలు పై సినిమాలు తీయడం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గాని నిలవడం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్టైల్. అందుకే ఎన్నో కాంట్రవర్సీలను ఆయన సినిమాలుగా ఎంచుకుంటూ ఉంటారు. అది రాజకీయాలైనా సినిమాల్లో ఉన్న వివాదాలైనా ఏదైనా సరే సినిమాకు అతీతం కాదు అనే స్టైల్ రాంగోపాల్ వర్మది. అందుకే ఆయన చేసే కామెంట్స్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం మరో సినిమాకు రాంగోపాల్ వర్మ కథ రెడీ చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్మను ఇబ్బంది పెడుతున్న టైంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై కథ రెడీ చేసుకుని సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వర్మ.
సంధ్య థియేటర్ ఘటన దగ్గర్నుంచి చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే దీని వెనుక వైసిపి ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ ఘటన విషయంలో వాస్తవాలు చెప్పడానికి వర్మ ట్రై చేస్తున్నాడని, అందుకే సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ను అందరూ దోషిగా చూడటంతో అసలు అక్కడ ఏం జరిగింది అనే దాన్ని వీడియో రూపంలో చూపించేందుకు వర్మ రెడీ అయ్యాడు. సినిమా ద్వారా అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని చెప్పేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన విషయంలో ఇప్పటికే అల్లు అర్జున్ జైలు కూడా వెళ్లి వచ్చాడు. ఆ సన్నివేశాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపించనున్నాడు వర్మ. అలాగే పోలీసు విచారణను కూడా తన సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యాడు. ముఖ్యంగా అరెస్టు రోజు చోటు చేసుకున్న పరిణామాలు అల్లు అర్జున్ కుటుంబంలో ఆరోజు ఉన్న పరిస్థితి ఆ తర్వాత సినిమా వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం ఇవన్నీ కూడా తన సినిమాలో చూపించనున్నాడు వర్మ. దీనికి అల్లు అర్జున్ అనుమతి ఇచ్చాడా లేదా అనేదానిపై క్లారిటీ లేదు.
నీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టినట్టే ఉంటుంది అనే ఒపీనియన్ కూడా వినపడుతోంది. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ బిహేవ్ చేశాడని కామెంట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ సినిమాను వర్మ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే కచ్చితంగా రేవంత్ రెడ్డిని మరింత రెచ్చగొట్టినట్టే ఉంటుంది. ఒకవైపు పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పై అల్లు అర్జున్ గత శనివారం ఇచ్చిన కౌంటర్ పైనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తెలంగాణ పోలీసులు ఆ తర్వాత మరిన్ని సాక్ష్యాలను రిలీజ్ చేశారు. అవి నిజం కాదని సినిమా రూపంలో వర్మ గనుక చూపిస్తే పరిస్థితి మారే అవకాశం కూడా ఉండవచ్చు.