Top story: వర్మా…నీకేంటి ఈ ఖర్మ ఎన్నాళ్లు తప్పించుకొని తిరుగుతావు

ముంబై మాఫియాకే భయపడని క్రియేటివ్ డైరెక్టర్‌ వర్మకు...ఏపీ పోలీసులంటే వణుకు మొదలైందా ? బొక్కలో వేసి...బొక్కలు ఇరగ్గొడతారనే టెన్షన్‌ పట్టుకుందా ? రాంగోపాల్‌ వర్మ...ఎక్కడున్నాడు ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ? పోలీసులకు దొరక్కుండా...ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 06:45 PMLast Updated on: Nov 26, 2024 | 6:45 PM

Varma Try To Escape From Ap Police

ముంబై మాఫియాకే భయపడని క్రియేటివ్ డైరెక్టర్‌ వర్మకు…ఏపీ పోలీసులంటే వణుకు మొదలైందా ? బొక్కలో వేసి…బొక్కలు ఇరగ్గొడతారనే టెన్షన్‌ పట్టుకుందా ? రాంగోపాల్‌ వర్మ…ఎక్కడున్నాడు ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ? పోలీసులకు దొరక్కుండా…ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాడు. ఒంగోలు పోలీసులు అరెస్టు చేస్తారన్న భయం పట్టుకుందా ? ఎన్ని రోజులు…దాచి పెట్టుకుంటారు ? దాచుకుంటే…పోలీసులు వదిలిపెడతారా ? వెంటాడాకుండా ఉంటారా ? వర్మ ఏంటీ ఖర్మ ?

రాంగోపాల్ వర్మ….క్రియేటివ్ డైరెక్టర్. శివ అనే ఒకే ఒక్క సినిమాతో స్టార్ దర్శకుడు అయిపోయాడు. ఇండియన్ సినిమాలోనే వర్మ పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్టయ్యాడు. అక్కడ కూడా దుమ్మురేపాడు. తన దర్శకత్వంతో సత్య, సర్కార్ వంటి సినిమాలు తీసి,…మాఫియాకే చుక్కలు చూపించాడు. డీ కంపెనీ డీలింగ్స్ ను…కళ్లకు కట్టినట్లు చూపించాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే ఇటు వైపు ఉన్నది రాంగోపాల్ వర్మ. ఎవరి మాట వినడు. అంతా నా ఇష్టం అంటాడు. దావుద్ ఇబ్రహీం అయితే భయపడాలా అనే రేంజ్ మన వర్మది. ఎవరేమనుకుంటే నాకేంటి…నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానంటాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోడు. వివాదం ఎక్కడ ఉంటే అక్కడికే రాంగోపాల్ వర్మ వెళతాడు. పబ్లిసిటీని పెంచేసుకుంటాడు. వోడ్కా తాగుతూ…అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాడు. పొద్దున్నే లేవగానే పోర్న్ చూస్తానంటాడు. అమ్మాయిల థైస్ అంటే ఇష్టమంటాడు. నా ఇష్ట వచ్చినట్లు సినిమాలు తీస్తా, చూస్తే చూడండి, లేకపోతే లేదంటూ హూంకరించాడు. ఏదైనా నిర్మోహమాటం మాట్లాడేస్తాడు. అదే ఇపుడు దర్శకుడి వర్మ కొంపముంచింది. కాదు కాదు…తలకు చుట్టుకుంటుంది.

దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎవరి హవా అయినా కొంతకాలం నడుస్తుంది. అన్ని వేళలా అందరి మాట నడవదు. దేనికైనా టైం ఉంటుంది. వర్మ విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. వైసీపీ హయాంలో తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై రెచ్చిపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండతో…చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై వ్యూహాం సినిమా తీశాడు. అచ్చు నేతల పోలికలతో ఉన్న నటులతో వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశాడు. వాటి ప్రమోషన్‌ కోసం అప్పటి విపక్ష నేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌లపై నోరు పారేసుకున్నారు. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్‌ ఫొటోలతో పోస్టులు పెట్టాడు. వైసీపీ ప్రభుత్వం పోయింది…టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇంకేముందీ ఆర్జీవీకి మూడింది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం బెదిరింపులకే భయపడని రాంగోపాల్ వర్మ…ప్రస్తుతం ఏపీ పోలీసుల పేరు చెబితేనే వణికిపోతున్నారు. దొరికితే బొక్కలోకి వేసి…బొక్కలు ఇరగ్గొడతారన్న టెన్షన్ పట్టుకుంది. ఎంతకాలం ఇలా దాక్కుంటారు వర్మా…పోలీసులను ఎంత ఇబ్బంది పెడితే…అన్ని కష్టాలు తప్పవు. పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరితే…పోలీసులు ఊరికే ఉంటారా ? కుక్కను కొట్టినట్లు కొట్టడం మాత్రం ఖాయమని జనం చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం వర్మా…నీకేంటి ఈ ఖర్మ అని సెటైర్లు వేస్తున్నారు.

ఈ నెల 19న ఒంగోలులో వర్మపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చాడు. మనోడి స్టైలే వేరు కదా ? అంతా నా ఇష్టం అనుకునే రకం…అందుకే విచారణకు డుమ్మా కొట్టేశారు. పోలీసులు మరోసారి పిలిచారు. నేను రానంటే రాను…అంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ మనోడికి ఎదురుదెబ్బ తగిలింది. వ్యవహారాన్ని పోలీసులతోనే తేల్చుకోవాలని చెప్పింది. ఒంగోలు పోలీసులు…ఆర్జీవీని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చారు. ఓ ఫాంహౌస్ లో ఉన్నాడన్న సమాచారంలో అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసులకు దొరికితే… తనను కుమ్మేస్తారోనన్న భయం వర్మకు పట్టుకుంది. అందుకే తాను తీసిన సినిమానే…నిజం జీవితంలో ఫాలో అయిపోతున్నారు. పోలీసులకు దొరక్కుండా…దౌడ్ సినిమాను అనుకరరిస్తున్నారు. ఖాకీల కళ్లుగప్పి…పరుగులు పెడుతున్నారు. తన ఆచూకీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. పోలీసు కేసును ఎదుర్కోవడానికి కనీస ధైర్యం చేయలేకపోతున్నారు. ముంబై మాఫియాను ఎదురించి సినిమాలు తీసిన వర్మ…ఏపీ పోలీసుల దెబ్బకు అబ్బా అంటున్నారు.

పోలీసులకు పరీక్షలు పెట్టి…దొరక్కుండా ఉండటం వెనుక ఓ లాజిక్ ఉందని వైసీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు చెప్పుకుంటున్నారు. పోలీసులకు దొరకకుండా దౌడ్ తీస్తే…వాళ్లంతా తన వెంట పడుతారు. పోలీసులకు చిక్కకుండా…డెన్ లు మారుస్తూ పోతే…వచ్చే కిక్కే వేరు అన్నది వర్మ ప్లాన్ గా తెలుస్తోంది. కొన్ని రోజులు పోలీసులను సతాయించి…అరెస్ట్ అయితే…సినిమా స్టోరీ లైన్ కూడా దొరుకుతుందన్నది వర్మ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి…తాను పోలీసులకు ఎలా చుక్కలు చూపించానో చూడండి సినిమా తీయాలన్నది వర్మ ఎత్తుగా అభివర్ణిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతోంది ?