బ్రేకింగ్: వైఎస్ భారతి పిఏ వర్రా దొరికాడు
గత నాలుగు రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహబూబ్ నగర్ వద్ద అరెస్టు చేసిన ఏపి పోలీసులు... అక్కడి నుంచి కడప తరలిస్తున్నారు.

గత నాలుగు రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహబూబ్ నగర్ వద్ద అరెస్టు చేసిన ఏపి పోలీసులు… అక్కడి నుంచి కడప తరలిస్తున్నారు. కడప పోలీస్ స్టేషన్ విచారణ తర్వాత కనిపించకుండా పోయిన రవీంద్ర రెడ్డి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పై ముఖ్య నేతలపై అసభ్యకర పోస్ట్ లు పెట్టాడు వర్రా.
రవీందర్ రెడ్డి అరెస్టు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో పాటు డిఎస్పీ, సిఐలపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. చంద్రబాబు, లోకేష్ సహా పలువురు ముఖ్య నేతల కుటుంబ సభ్యులపై వర్రా అభ్యంతరకర పోస్ట్ లు పెట్టాడు.