Kodali Nani: కొడాలి నానికి వెనిగండ్ల రాము చెక్‌పెట్టగలడా.. చంద్రబాబుకు అతనిపై ఎందుకంత నమ్మకం..?
కొడాలి నానికి రాము ఎంతవరకు పోటీ ఇవ్వగలడు అనేది పెద్దప్రశ్నగా మారింది. ఆయన చేతికి చంద్రబాబు ఎలాంటి ఆయుధాలు అందిస్తారు.. ఎలాంటి స్ట్రాటజీలు సిద్ధం చేసి చేతిలో పెడతారు అనే చర్చ జరుగుతోంది.
Kodali Nani: రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఫోకస్ చేసిన స్థానాల్లో గుడివాడ ఒకటి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, బాలయ్యపై నోరుపారేసుకునే కొడాలి నానిని.. ఈసారి ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది. దీనికోసం బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని ప్లాన్ చేశారు. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నానిని ఓడించాలంటే మాములు విషయం కాదు.
DELHI LIQOUR SCAM: ముందు కేజ్రీవాల్.. తర్వాత కవిత.. అరెస్టు తప్పదా..?
గుడివాడలోని ప్రతీ గల్లీలో నానికి ఫాలోయింగ్ ఉంది. దీంతో చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారా అనే ఉత్కంఠ కనిపించింది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని సమన్వయకర్తగా నియమించినప్పటికీ.. చివరిలో అభ్యర్ధిని మారుస్తారా అన్న అనుమానాలు కనిపించాయ్. ఐతే వీటికి చెక్ పెడుతూ వెనిగండ్ల రామునే కన్ఫార్మ్ చేశారు చంద్రబాబు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ.. కొడాలి నానికి రాము ఎంతవరకు పోటీ ఇవ్వగలడు అనేది పెద్దప్రశ్నగా మారింది. ఆయన చేతికి చంద్రబాబు ఎలాంటి ఆయుధాలు అందిస్తారు.. ఎలాంటి స్ట్రాటజీలు సిద్ధం చేసి చేతిలో పెడతారు అనే చర్చ జరుగుతోంది. నానిలాంటి నేత మీద రామును పోటీ దింపాలని చంద్రబాబు ఎందుకు ఫిక్స్ అయినట్లు.. ఆయన అంత స్పెషలా.. అంత బలం ఉందా.. చంద్రబాబుకు ఎందుకు అంత నమ్మకం అనే చర్చ జరుగుతోంది. 2004నుంచి ఓటమి తెలియకుండా గుడివాడలో పాతుకుపోయారు కొడాలి నాని. ఆయనను ఓడించేందుకు చంద్రబాబు.. జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు.
అదే రెండు కులాల ఈక్వేషన్. అంటే భర్త ఒక కులమైతే, భార్య మరో కులం. శింగనమల, చిలకలూరిపేట, తాడికొండ, కళ్యాణదుర్గంలో ఇదే స్ట్రాటజీని అమలు చేశారు. గుడివాడలో వెనిగండ్ల రాము కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన సతీమణి మాల సామాజికవర్గానికి చెందినవారు. భర్త గెలుపు కోసం ఆమె కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ, దళితులను టీడీపీ వైపు వచ్చేలా చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అదనపు బలం రాముకి లభించినట్లు అయింది. గుడివాడలో కాపులు, పవన్ అభిమానుల సంఖ్య ఎక్కువే. వీటన్నింటి సాయంతో కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఇవన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అన్నది చూడాలి.