Vice President : నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్జడ్ పర్యటన సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్జడ్ పర్యటన సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉప రాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని.. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్న సీఎస్ శాంతికుమారి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేయాలని, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి జినోమ్ వ్యాలీలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.
SSM