YS Jagan: లాబీయింగ్‌ కోసమా.. నిజంగా ఆశీర్వాదమా.. ఎవరీ విజయ్‌కుమార్ స్వామీ.. జగన్‌కు తలపోటు తప్పదా ?

ఏపీలో అన్ని విషయాలు పక్కకుపోయాయ్ ఇప్పుడు.. ఒక్క వివేకా హత్య కేసు తప్ప! భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినాశ్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందన్నది టెన్షన్‌ పుట్టిస్తోంది. ఈ నెల 25వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దని కోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ తర్వాత ఏం జరగబోతోందన్న ఆందోళన.. వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అంటే.. ఓ ఎంపీనో, ఓ వ్యక్తినో అరెస్ట్ చేయడం కాదు.. వైఎస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం.. అదీ పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం.. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2023 | 05:45 PMLast Updated on: Apr 19, 2023 | 5:45 PM

Vijaya Kumar Swami Bless To Cm Ys Jagan

అందుకే జగన్ ముందుగానే అప్రమత్తం అయ్యారు. 25 తర్వాత అవినాశ్‌ రెడ్డి అరెస్ట్ జరిగితే.. ఏం చేయాలి.. ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి.. మీడియా ముందు వెనక ఎలా బిహేవ్ చేయాలి.. ఇలా ప్రతీ విషయాన్ని పార్టీ నేతలకు సూచించారు జగన్. ఇదంతా ఎలా ఉన్నా.. ఓ స్వామిజీ స్పెషల్ ఫ్లైట్‌లో ఏపీకి వచ్చి.. జగన్‌ను దీవించడం.. కాదు కాదు దీవించారని వైసీపీ నేతలు చెప్పడం.. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇంతకీ ఆ స్వామీజీ ఎవరు.. ఆరు గంటలకు పైగా ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేసుకొని మరీ జగన్ ఎందుకు దీవెనలు తీసుకున్నారు. ఆయన అంత పవర్‌ఫుల్‌ వ్యక్తా.. ఏం జరిగింది.. ఏం జరగబోతోంది.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి.

దీంతో విజయ్‌ కుమార్ స్వామీజీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. అసలు ఆయన అంత హడావుడిగా అమరావతికి ఎందుకు వచ్చారు. వస్తే వచ్చారు జగన్‌కు దీవెనలే ఇచ్చారనుకుందాం.. ఆ విషయం ఎందుకు బయటకు రాకుండా చూశారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్న. ఒకరకంగా ఇవన్నీ విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి ఇప్పుడు ! ఇంత రచ్చ జరుగుతుంటే.. వైవీ సుబ్బారెడ్డి చేసిన వాదన మరో చర్చకు కారణం అయింది. రామోజీరావుకు విజయ్‌కుమార్‌ స్వామీజీ సన్నిహితులు అనేలా కొత్త వాదన తెరమీదకు తీసుకువచ్చారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు విజయ్‌కుమార్‌ స్వామీజీ ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు జనాలు.

కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్‌.. ప్రముఖ జోతిష్యుడిగా పేరుంది. ఆన్‌లైన్‌లో జోతిష్య సలహాలు ఇస్తుంటారు. ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. జోతిష్యం కంటే.. లాబీయింగ్‌లు ఎక్కువ చేస్తుంటారనే పేరు ఉంది. తనకున్న పరిచయాలతో తెర వెనక చక్రం తిప్పుతూ పనులు చక్కబెడతారని టాక్. అందుకే విజయ్‌కుమార్‌ను జగన్‌ పిలిపించారన్నది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్‌కు భయం పట్టుకుందని.. మరిన్ని అరెస్టులు ఉంటాయని టెన్షన్ పడుతున్నారని.. కేంద్ర పెద్దలతో పని కావడం లేదని భావించి.. స్వామీజీలను నమ్ముకుంటున్నారని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అందుకే స్పెషల్ ఫ్లైట్‌ వేసి మరీ విజయ్‌కుమార్‌ను రప్పించారని.. ఇదంతా వివేకా కేసులో లాబీయింగే అని విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి కొత్త తలపోటు పట్టుకున్నట్లు అయింది. వైసీపీకి వరుసగా ఇప్పుడు షాక్‌లు తగులుతున్నయ్. ఎమ్మెల్సీ ఫలితాలు పెద్ద షాక్ అనుకుంటే.. ఆ తర్వాత కోడి కత్తి కేసులో మరో ఝలక్.. తర్వాత వివేకా కేసులో భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌.. ఇప్పుడు స్వామీజీ తతంగం. ఇలా ఏపీ సర్కార్‌కు, అధికార పార్టీని వరుస తలనొప్పులు వెంటాడుతున్నాయి. తల నొస్తే జండూ బామ్ రాసుకొని రిలాక్స్ కావొచ్చు.. నిజంగా విజయ్‌ కుమార్ స్వామీజీని జగన్‌ నమ్ముకున్నారా.. అదే నిజం అయితే ఆయన బయట పడేయగలరా.. పడేసే స్థాయి ఉందా అంటే.. వెయిట్ అండ్ సీ అంటోంది రాజకీయం.